ఆ మాజీ ఐఏఎస్‌.. టీడీపీ ఎమ్మెల్యేగా స‌క్సెస్ అయ్యారా... ?

admin
Published by Admin — September 29, 2026 in Politics, Andhra
News Image

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు(Burla Ramanjaneyulu) ఫ‌స్ట్‌టైమ్ ఎమ్మెల్యే. గ‌తంలో ఆయ‌న క‌లెక్ట‌ర్‌గా, వివిధ శాఖ కార్య‌ద‌ర్శిగా కూడా ప‌నిచేశారు. పైగా చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. ఇదే.. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ ద‌క్కేలా చేసింది. ఇక‌, తన పరిపాలనా అనుభవంతో నియోజకవర్గంలో చురుకైన పాత్ర పోషిస్తున్నా కూట‌మి ప‌రంగా మాత్రం ఆయ‌న వెనుక‌బాటులో ఉన్న‌ర‌న్న‌ది టీడీపీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌.  2024 ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుండి ఆయన పనితీరుపై ప్రజాక్షేత్రంలో, రాజకీయ వర్గాల్లో మిశ్రమ స్పంద‌నే ఉంది. ఆయన పనితీరుకు సంబంధించి చంద్ర‌బాబుకు కూడా కొన్ని ఫిర్యాదులు.. అదే స‌మ‌యంలో సానుకూల ప‌రిణామాలు కూడా వ్య‌క్త‌మ‌య్యాయి.

ప్రజా దర్బార్  నిర్వ‌హిస్తూ.. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నార‌న్న‌ది సానుకూల స‌మాచారం. నియోజకవర్గ కేంద్రంలో రెగ్యులర్‌గా 'ప్రజా దర్బార్' కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజల నుండి నేరుగా ఇళ్ల నిర్మాణాలు, పెన్షన్లు, భూ సమస్యలపై వినతులు స్వీకరిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధికి కృషి చేస్తున్నార‌న్న‌ది వాస్త‌వ‌మే. మాజీ కలెక్టర్ కావడంతో, ప్రత్తిపాడు(Prathipadu) అభివృద్ధిపై ప్రతి నెలా సమీక్షలు నిర్వహిస్తూ, సాగునీటి కాలువల మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇక‌, ప్రభుత్వ పథకాల పంపిణీలోనూ ఆయ‌న కీల‌క రోల్ పోషిస్తున్నారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి, ఇతర సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేర్చడంలో చురుగ్గా పాల్గొంటున్నారు. శాసనసభ సమావేశాలలో(Assembly Sessions) పారిశ్రామిక విధానాలు, నియోజకవర్గ సమస్యలపై స్పష్టమైన అవగాహనతో మాట్లాడుతుంటారు. అయితే.. ప‌నితీరు ఒక్క‌టే వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ప్రామాణికంగా తీసుకోలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. రాజ‌కీయంగా ఏమేర‌కు ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు?  కూట‌మి పార్టీల‌తో ఏమేర‌కు క‌లివిడిగా ఉంటున్నార‌న్న‌ది కూడా ముఖ్య‌మే. ఈ ప‌రంగా చూస్తే.. అభివృద్ధి పనులతో ముందుకు వెళ్తున్నప్పటికీ, స్థానిక కూటమి/పార్టీ నాయకులతో కొన్ని అంతర్గత విభేదాలు, సమన్వయ లోపాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ముఖ్యంగా సొంత పార్టీ నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు కూడా ఎమ్మెల్యే అప్పాయింట్‌మెంటు ఇవ్వ‌డం లేద‌న్న చ‌ర్చ ఉంది. అంతేకాదు.. త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చేవారిని కూడా ముక్త‌స‌రిగా ప‌ల‌క‌రించ‌డం.. అధికారిక హోదాతోనే మాట్లాడ‌డం వంటివి మైన‌స్‌గా మారుతున్నా యి. నాయ‌కుడిగా ఆయ‌న పూర్తిగా మార‌లేద‌న్న టాక్ వినిపిస్తోంది. స‌హ‌జంగానే క‌లెక్ట‌ర్ కు ఉండే ల‌క్ష‌ణాలు భిన్నంగా ఉంటాయి. వారు ఎవ‌రితోనూ పెద్ద‌గా క‌ల‌వ‌రు. పైగా.. భుజాల‌పై చేయి వేసి మాట్లాడే ప‌రిస్థితి కూడాఉండ‌దు. కానీ, రాజ‌కీయాల్లో ఆ త‌ర‌హా ప‌రిస్థితికి పూర్తి భిన్న‌మైన సంస్కృతి ఉంటుంది. కార్య‌క‌ర్త‌లు నేత‌ల‌తో క‌లివిడిగా ఉండాల‌ని కోరుకుంటారు. ఇక‌, కూట‌మి నాయ‌కులు త‌ర‌చుగా క‌లుసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాల‌ని అడుగుతారు. ఈ విష‌యంలోనే ఎమ్మెల్యే రామాంజ‌నేయులు(MLA Ramanjaneyulu) వెనుక‌బ‌డుతున్నార‌న్న‌ది పెద్ద ఎత్తున జ‌రుగుతున్న చ‌ర్చ‌. మ‌రి ఆయ‌న తీరు మారుతుందా?  లేదా? అనేది చూడాలి.

Tags
Burla Ramanjaneyulu Prathipadu AP News AP Politics Andhra Pradesh CM Chandrababu
Recent Comments
Leave a Comment

Related News