వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ వంతు వచ్చింది. తాజాగా ఆయన బుధవారం సాయంత్రం సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 11న విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరు కావాలని దానిలో పేర్కొన్నారు. అయితే.. ఈ నోటీసులు తీసుకునేందుకు జోగి రమేష్ అంగీకరించలేదని తెలిసింది. పోలీసులు వెళ్లిన సమయంలో ఆయన ఇంట్లో లేరని.. వాచ్‌మెన్‌ను విచారించగా.. ఎక్కడికి వెళ్లారో తెలియదని సమాధానం ఇచ్చినట్టు పోలీసులు చెబుతున్నారు.