ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశించి తాజాగా బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు జనసైనికుల ఆగ్రహానికి కారణం అయ్యాయి. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కవిత.. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం అయ్యేంత స్థాయి లేదంటూ నోరు జారారు. ప్రజలు హిందీ నేర్చుకోవాలన్న పవన్ వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అవుతారని యాంకర్ ప్రశ్నించగా.. పార్టీ పెట్టిన 15 ఏళ్లకు ఎమ్మెల్యేగా ఎన్నికైన పవన్ కళ్యాణ్.. ఏపీలో వైసీపీ మినహా దాదాపు అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు, అనుకోకుండా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అది ఏపీ ప్రజల దురదృష్టమంటూ కవిత వ్యాఖ్యానించారు.