వైసీపీ కార్యకర్తలు.. అభిమానం పేరుతో అరాచకం సృష్టించారు. మంగళవారం వైసీపీ అధినేత జగన్.. శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పర్య టించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఇటీవల దారుణ హత్యకు గురైన పార్టీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. వారికి భరోసా ఇచ్చారు. పార్టీ తరఫున సాయం చేస్తామని.. అండగా ఉంటామని కూడా చెప్పారు. అయితే.. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వైసీపీ కార్యకర్తలు పోగయ్యారు.