వైసీపీ అధినేత జగన్.. శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం పర్యటనలో పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ నాయకులను వేధించే పోలీసుల యూనిఫాంను ఊడదీయిస్తానని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేత లింగమయ్య ఇటీవల హత్యకు గురయ్యారు. ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. జగన్ ఇలా పోలీసులపై నోరు చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించినప్పుడు కూడా నోరు పారేసుకున్నారు.