ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రపంచ ప్రఖ్యాత నవ నగరాల సమూహంగా ఏపీ రాజధాని అమరావతిని నిర్మిస్తున్న విషయం తెలిసిం దే. దీనికిసంబంధించి కేంద్రం నుంచి నిధులు కూడా వచ్చాయి. పనులు రేపో మాపో ప్రారంభం కానున్నాయి. త్వరలోనే రాజధా ని నిర్మాణ పనులు పుంజుకుంటాయని మంత్రి నారాయణ ఇటీవలే చెప్పారు. ఇదిలావుంటే.. సీఎం చంద్రబాబు రాజధానిని అంత అద్భుతంగా నిర్మిస్తున్నా.. ఇక్కడ ఆయనకు సొంత నివాసం అంటూ లేదు. ప్రస్తుతం ఉండవల్లిలో ఉంటున్న నివాసం అద్దెకు తీసుకున్నారు. లింగమనేని ఎస్టేట్ అధినేత.. చంద్రబాబుకు ఈ నివాసాన్ని అద్దెకు ఇచ్చారు.