శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం వైఎస్ జగన్ పరామర్శించిన సంగతి తెలిసిందే. లింగమయ్య కుటుంబాన్ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ మరోసారి పోలీసులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పోలీసులు తమ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయడం మానేసి చంద్రబాబు వాచ్మెన్లుగా పని చేస్తున్నారంటూ జగన్ చిందులు తొక్కారు.