వైసీపీ(ycp) అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్షం టీడీపీ, జనసేన నేతలపై వైసీపీ సోషల్ మీడియా విభాగం రెచ్చిపోయింది. అత్యంత దారుణంగా టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu)ను యానిమేషన్ చిత్రాలుగా రూపొంచింది. ఈ క్రమంలో ఆయన చేతిలో కత్తులు పెట్టడంతోపాటు.. ఇతర ఆయుధాలను కూడా పెట్టి చిత్రీకరించారు. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులపైనా అనుచిత వ్యాఖ్యలు ప్రచారం చేశారు. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా.. ఆయన కుటుంబ సభ్యులపైనా ఇలానే చేశారు.
అయితే. కూటమి సర్కారు వచ్చిన తర్వాత వాటిపై కేసులునమోదయ్యాయి. ఈ క్రమంలో జగన్‌కు అత్యంత ఆప్తుడిగా పేరొందిన ఆయన సీపీ ఆర్వో పూడి శ్రీహరి(poodi srihari) సహా.. గిరీష్ కుమార్ రెడ్డిలపై కేసులు నమోదయ్యాయి. చంద్రబాబును అనుచితంగా చిత్రీకరించారని కేసులో పేర్కొన్నారు. అయితే.. శ్రీహరి సహా గిరీష్‌ను ఈ నెల 15నే కుప్పం పోలీసులు అరెస్టు చేశారు. కానీ.. వారికి కుప్పం కోర్ట్ రిలీఫ్ ఇచ్చింది. అరెస్టు నుంచి మినహాయించింది.
దీంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఫలితంగా కుప్పం కోర్టు ఇచ్చిన రిలీఫ్‌ను హైకోర్టు తొలగిం చింది. దీనిపై పూడి శ్రీహరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు మధ్యంతర రక్షణ కల్పించాలని అరెస్టు నుంచి కాపాడాలని వేడుకున్నారు.కానీ, సుప్రీంకోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చేసింది.ఈ పరిణామాల క్రమంలోబెంగళూరు నుంచి విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న సమాచారంతో బెంగళూరులో నిఘా పెట్టిన కుప్పం పోలీసులు.. పూడి శ్రీహరిని బుధవారం అరెస్టు(arrested) చేశారు.