అమెరికాలోని బే ఏరియాలో ఇండియన్ అమెరికన్స్ అసోసియేషన్ (AIA) ఆధ్వర్యంలో భారతదేశపు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి, భారత దేశపు ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ వేడుకలు జరిగాయి. కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ లో ఉన్న ఇండియా కమ్యూనిటీ సెంటర్ (ICC) లో ఈ కార్యక్రమం జరిగింది.1500 మందికి పైగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
15 మందికి పైగా ఎన్నికైన అధికారులు, సమాజ సభ్యులు, సాంస్కృతిక సంస్థలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. భారత రాజ్యాంగ వారసత్వం, ప్రజాస్వామ్య విలువలు మరియు సాంస్కృతిక వారసత్వాన్ని స్మరించుకునేలా ఈ కార్యక్రమం జరిగింది. మువ్వన్నెల భారతీయ జెండాను సూచించేలా వేదికను, ప్రాంగాణాన్ని అలంకరణలతో అందంగా తీర్చిదిద్దారు. దాంతో, అక్కడ దేశభక్తి వాతావరణం ఏర్పడింది.
భారతీయత ఉట్టిపడేలా వస్తువులతో వివిధ స్టాల్స్ ఏర్పాటయ్యాయి. ఈ వేడుకలలో ఎన్నో ఆకర్షణీయమైన సాంస్కృతిక కార్యక్రమాలున్నాయి. AIA ఐడల్ పాటల పోటీలు, దేశభక్తి పాటలపై నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. యువతీయువకులు తమ కళాత్మక ప్రతిభను ప్రదర్శించారు. " భిన్నత్వంలో ఏకత్వం " కాన్సెప్ట్ ను ఈ వేడుకల ప్రతిబింబించాయి.
ఎన్నికైన అధికారులను వేదికపైకి ఆహ్వానించారు. అంతకు ముందు, AIA సహకార సంస్థల ప్రతినిధులను స్వాగతించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇండో అమెరికన్ సమాజంలోని బలమైన సహకార స్ఫూర్తికి, AIA భాగస్వామ్య సంస్థల సామూహిక నిబద్ధతకు ఈ వేడుకలే నిదర్శనం. ఈ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి పలువురు ప్రముఖ అతిథులు మరియు ఎన్నికైన అధికారులు హాజరయ్యారు.
ఇండియా కాన్సుల్ జనరల్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి
టామ్ పైక్ (రో ఖన్నా ప్రతినిధి)
నికోలస్ హార్గిస్ (సామ్ లిస్కార్డో ప్రతినిధి)
కాంగ్రెస్ వుమన్ జో లోఫ్‌గ్రెన్ (రికార్డెడ్ మెసేజ్)
అసెంబ్లీమెంబర్ అష్ కల్రా (డిస్ట్రిక్ట్ 25)
అసెంబ్లీ మెంబర్ అలెక్స్ లీ (డిస్ట్రిక్ట్ 24)
శాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ జెఫ్ రోసెన్
శాంటా క్లారా కౌంటీ సూపర్ వైజర్ ఓట్టో లీ (డిస్ట్రిక్ట్ 3)
దీపక్ అవస్థి (మిల్పిటాస్ మేయర్ కార్మెన్ మాంటానో ప్రతినిధి)
ఫ్రీమాంట్ మేయర్ రాజ్ సల్వాన్
సన్నీవేల్ మేయర్ ల్యారీ క్లీన్
సాన్ కార్లోస్ మేయర్ ప్రణీత వెంకటేష్
సారటోగా వైస్ మేయర్ టీనా వాలియా
లాస్ ఆల్టోస్ వైస్ మేయర్ నేసా ఫ్లిగర్
ఫ్రీమాంట్ మేయర్ ఎమెరిటా లిలీ మే
ఫ్రీమాంట్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ బోర్డ్ మెంబర్ వివేక్ ప్రసాద్
ఫ్రీమాంట్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ బోర్డ్ మెంబర్ రిను నాయర్
అజయ్ భుటోరియా, ఇండియన్ కమ్యూనిటీ
భారతదేశపు ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం పట్ల నిబద్ధత, ప్రజాస్వామ్య సూత్రాల అమలును వక్తలు ప్రశంసించారు. పౌరులుగా మన హక్కులు, బాధ్యతల గురించి ఆలోచించేందుకు, ప్రజాస్వామ్య ఆదర్శాలపై మన నిబద్ధతను పునరుద్ఘాటించడానికి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఓ మంచి అవకాశమని తెలిపారు. అనేక దేశాలు స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం కోసం చేసిన దీర్ఘకాల పోరాటాలను గుర్తుచేశారు. ఈ విజయ గాథలను కాపాడుకోవడం, గౌరవించడం, నేర్చుకోవడం కొనసాగించాలని ఆకాంక్షించారు.
అమెరికాలో నివసిస్తున్న భారతీయ అమెరికన్ కమ్యూనిటీకి భారతీయ సంస్కృతి, వారసత్వం గురించి చర్చించేందుకు అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఒక చక్కని వేదికను అందిస్తున్న ఎన్ జీవో. సభ్యుల మధ్య సాంస్కృతిక మరియు సామాజిక పరిచయాలను ప్రోత్సహించడం AIA లక్ష్యం. భారత ఉపఖండానికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు మరియు విద్యా కార్యక్రమాలను నిర్వహించడం,
భారత ఉపఖండంలోని విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని, సంస్కృతిని సభ్యలతో పంచుకోవడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యాలు. సిలికాన్ వ్యాలీలో 50కి పైగా వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల సమూహం ఈ ఏఐఏ.
ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు దోహదపడిన భాగస్వాములు, అధికారులు మరియు సమాజ సభ్యులకు ఏఐఏ కృతజ్ఞతలు తెలియజేసింది. స్థానిక సమాజాన్ని బలోపేతం చేసే ఇటువంటి ప్రయత్నాలను కొనసాగించాలని ఆకాంక్షిస్తోంది. గౌరవనీయులు, వక్తలు, ప్రదర్శకులు, విక్రేతలు, వాలంటీర్లు, సహకార సంస్థలు మరియు సమాజ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. వారి మద్దతుతోనే ఈ 77వ గణతంత్ర దినోత్సవ వేడుక ఘనంగా జరిగిందని చెప్పింది.