బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA) సంక్రాంతి సంబరాలను అమెరికాలోని బే ఏరియాలో ఘనంగా నిర్వహించింది. మిల్పిటాస్‌లోని ఇండియా కమ్యూనిటీ సెంటర్ (ICC)లో ఉదయం 11:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. 1000 మందికి పైగా హాజరైన ఈ ఉత్సవంలో తెలుగు సంప్రదాయాలు, సంస్కృతి నిండిన వాతావరణం కనిపించింది.
మల్టీ కలర్ బ్యాక్‌డ్రాప్‌లు, రంగురంగుల పతంగులతో సంక్రాంతి కళ ఉట్టిపడేలా వేదికను అందంగా అలంకరించారు. బాటా స్వచ్ఛంద సేవకులు, అతిథులు, వివిధ ఈవెంట్లలో పాల్గొనే పార్టిసిపెంట్లు సంప్రదాయ దుస్తుల్లో మెరిసి ఉత్సవ వైభవాన్ని మరింత పెంచారు.
40కి పైగా రుచికరమైన తెలుగు వంటకాలతో కూడిన విందు భోజనం అందరూ ఆరగించారు. సాంప్రదాయ తెలుగు స్వీట్లు, సక్కినాలు, ఊరగాయలు, పులిహోర, పనసపొట్టు పలావ్, పెరుగన్నం, గుత్తి వంకాయ, ఉలవ చారు, రాగి సంకటి, ముద్ద పప్పు, దప్పలం, వడియాలు, పాన్, ఇతర వంటకాలు అందరూ కడుపునిండా తిన్నారు. ఇక, బిర్యానీ జంక్షన్ నుంచి భోజనం, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తెప్పించిన ప్రత్యేక స్వీట్లు, స్నాక్స్‌లు అందరూ నోరారా ఆస్వాదించారు. 5 దశాబ్దాలుగా తమకు మద్దతుకు నిలిచిన వారందరికీ బాటా సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
సూపర్ ఛెఫ్ (వంట పోటీలు), పిల్లల కోసం లిటిల్ ఛెఫ్ (తల్లిదండ్రుల సహాయం లేకుండా స్వయంగా వంట చేసిన పిల్లలు), రంగవల్లి (ముగ్గులు) పోటీలు, ఆర్ట్ కాంటెస్ట్, ఎస్సే రైటింగ్, బొమ్మల కొలువు, AIA ఐడల్ సింగింగ్ కాంటెస్ట్ (ఈస్ట్ బే కరోకే, BATA/AIA టీమ్స్ సహకారంతో) రంగవల్లి పోటీలు నిర్వహించారు. ఇవన్నీ తెలుగు లోగిళ్లలోని సంక్రాంతి పండుగను తలపించాయి.
BATA కరోకే టీమ్ నుంచి మెలోడియస్ పాటల పల్లకి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్, క్లాసికల్ డాన్స్ బాలే, ఫోక్ డాన్సెస్, తాజా టాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్స్‌పై అందరూ ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. "నాన్న & కిడ్స్" ఫ్యాషన్ షో అద్భుతమైన హిట్ గా నిలిచింది.
సాయంత్రం కార్యక్రమం భోగి పళ్ళతో ప్రారంభమైంది. పిల్లలు, తల్లిదండ్రులు, తాతయ్యల భక్తి పాటలతో వసుధైక కుటుంబాన్ని తలపించేలా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. పిల్లలందరినీ పెద్దలు ఆశీర్వదించారు. TANA-BATA సంయుక్తంగా నడిపే పాఠశాల తెలుగు స్కూల్ విద్యార్థులు స్కిట్స్, భారత రిపబ్లిక్ డే సందర్భంగా దేశభక్తి పాటలతో, వివిధ కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.
భారతదేశపు 77వ గణతంత్ర దినోత్సవాన్ని AIA (అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్) కూడా నిర్వహించింది. కాన్సుల్ జనరల్ డైరెక్టర్ శ్రీకర్ రెడ్డి మరియు స్థానిక ఎన్నికైన అధికారులు ఆ వేడుకకు హాజరై సంక్రాంతి & గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. AIA & BATA టీమ్‌లను అభినందించారు.
ఈ ఈవెంట్ స్పాన్సర్లు:
గ్రాండ్ స్పాన్సర్ - సంజీవ్ గుప్తా CPA
"పవర్డ్ బై" స్పాన్సర్ - రియల్టర్ నాగరాజ్ అన్నయ్య
గోల్డ్ స్పాన్సర్ - శ్రీని గోలి రియల్ ఎస్టేట్స్
ఇతర స్పాన్సర్లు: ఇన్‌స్టా సర్వీస్, PNG జ్యువెలర్స్, APEX కన్సల్టింగ్, ఎర్త్ క్లీన్స్, కావ్య ఫుడ్స్
వాలంటీర్లందరికీ BATA అధ్యక్షుడు శివ.కె కృతజ్ఞతలు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ (వరుణ్, హరి ఎస్, సందీప్ కె, సంకేత్), కల్చరల్ కమిటీ (శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, సిరీష బట్టుల, తారక దీప్తి, కిరణ్ విన్నకోట), లాజిస్టిక్స్ టీమ్ (సురేష్ శివపురం, రవి పోచిరాజు, హరీష్ అయినంపూడి, సుధాకర్ బైరి), యూత్ కమిటీ (ఉదయ్, గౌతమి, సింధు), ఆర్ట్ & డిజైన్ కమిటీ (కళ్యాణి, కృష్ణ ప్రియ, దీప్తి, స్రవంతి), స్టీరింగ్ కమిటీ (రవి తిరువీధుల, కమేష్ మల్ల, యశ్వంత్ కుదరవల్లి, సుమంత్ పుసులూరి)ని ఆయన పరిచయం చేశారు.
ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసిన బాటా టీమ్‌ను అడ్వైజరీ బోర్డ్ సభ్యులు (జయరాం కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండ, కల్యాణ్ కట్టమూరి, హరినాథ్ చికోటి) అభినందించారు.