కల్తీ మచ్చను కడిగి వేయడానికి,భక్తుల నమ్మకాన్ని తిరిగి నిలబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ ఆలయ శుద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానాలలోని
ప్రసాద పవిత్రతపై వచ్చిన ఆరోపణలు కేవలం పరిపాలనా వైఫల్యం కాదని ఆయన అన్నారు.
ఇది దైవ విశ్వాసంపై జరిగిన దాడి అని, ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ రాజకీయ కోణంలో కాకుండాధర్మ పరిరక్షణ కోణంలోనే చూస్తోందని
చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ విషయం ప్రజలకు స్పష్టంగా గుర్తుండాలని చెప్పారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు పాలనలో టీటీడీ అంటే క్రమశిక్షణ, పవిత్రత, పారదర్శకత అని,
ప్రసాదం విషయంలో ఎక్కడా రాజీ లేదని తెలిపారు. కూటమి పాలనలో వ్యవస్థ పనిచేసిందని, బాధ్యత కనిపించిందని చెప్పారు. కానీ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రసాద పవిత్రతపై అనుమానాలు వ్యక్తమయ్యాయని, కల్తీ మచ్చలు ఏర్పడ్డాయి అని విమర్శలు చేశారు.
జగన్ పాలనలో భక్తుల మనోభావాలపై తీవ్ర నిర్లక్ష్యం వహించారని ,ఇది యాదృచ్ఛికం కాదని అన్నారు.
ఇది పాలనా అహంకారానికి వచ్చిన ఫలితం అని అన్నారు. దేవుడి పేరుతో అధికారాన్ని ఆస్వాదించినవారు....దేవుడి ప్రసాద పవిత్రతను కాపాడలేకపోయారని దుయ్యబట్టారు. ఈ రోజు జరుగుతున్న ఆలయ శుద్ధి కార్యక్రమం ఎవరి తప్పునూ దాచేందుకు కాదని అన్నారు.
జగన్ పాలన మౌనంగా ఉంటే, చంద్రబాబు పాలన బాధ్యతను గుర్తు చేసిందని తెలిపారు.ఇదే రెండు పాలనల మధ్య స్పష్టమైన తేడా అని అన్నారు. దోషులు ఎవరో తేలాలని,
బాధ్యత ఎవరిదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు సమాధానం ఇవ్వాలని, ఇది రాజకీయ ఆరోపణ కాదని అన్నారు. ఇది ప్రజల విశ్వాసం తరఫున వేసిన ప్రశ్న అని, ధర్మం వైపు ఎవరు ఉన్నారో
ఈ ఆలయ శుద్ధి కార్యక్రమమే చెబుతోందని చెప్పారు. భక్తులు చూస్తున్నారని, రాబోయే రోజులలో ప్రజలే మళ్ళీ జగన్ కు బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు