పుణేలోని బారామతిలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. బారామతిలోని మినీ విమానాశ్రయంలో అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టెడ్ ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయింది. విమానం ల్యాండ్ చేస్తుండగా పైలట్ ఒక్కసారిగా విమానంపై అదుపు కోల్పోయి రన్ వేపై క్రాష్ ల్యాండ్ చేశాడని తెలుస్తోంది. ప్రమాద తీవ్రతకు విమానం పూర్తిగా దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్ తో పాటు విమానంలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు.
ఘటనా స్థలంలో సహాయక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఎన్నికల ప్రచారం కోసం అజిత్ పవార్ ఈ రోజు ఉదయం ముంబై నుంచి బారామతికి బయల్దేరారు. అజిత్ పవార్ మృతిపై ప్రధాని మోదీతో పాటు పలువురు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతిపై ప్రగాడ సంతాపం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితమే తన సోదరుడు శరద్ పవార్ తో అజిత్ పవార్ ప్యాచప్ చేసుకున్న సంగతి తెలిసిందే.