 
    భవిష్యత్తులో ఏం జరుగుతుందో అంచనా వేసి చెప్పటం.. అది అక్షరసత్యంగా జరగటం తెలిసిందే. తెలుగువారికి సుపరిచితులు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి. వందల ఏళ్ల క్రితమే భవిష్యత్తులో ఏం జరుగుతుందన్న విషయాన్ని అంచనా వేసి.. భవిష్యవాణిని చెప్పటం.. అవన్నీ ఆయన చెప్పినట్లే జరగటం తెలిసిందే. ఇప్పటికి ఏదైనా అనుకోనిది జరిగితే.. అప్పట్లో వీరబ్రహ్మంగారు చెప్పారా? అని చెక్ చేసుకోవటం కనిపిస్తుంది.
అయితే.. ఈ వీరబ్రహ్మేంద్రస్వామిది ఇప్పటి వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన వారు. వరుస వర్షాలతో పాటు.. మొంథా తుపాను కారణంగా కురిసిన వర్షాలకు 350 ఏళ్ల నాటి ఇల్లు కూలిపోయింది. వరుస వర్షాలకు బాగా నానిన ఈ ఇల్లు ఒక వైపు పడిపోయింది. ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవటంతో ప్రమాదం తప్పింది.
ఈ ఇల్లు 350 ఏళ్ల నాటిదని చెప్పారు. అయితే.. అప్పట్లో ఉన్న గోడలకు తర్వాతి కాలంలో మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చారు. పాత ఇంటిని అలానే ఉంచేశారు. వందల ఏళ్ల నాటిది కావటం వరుస వర్షాలకు నానటంతో ఆ ఇల్లు కూలింది. ఇల్లు కూలిన విషయాన్ని తెలుసుకున్న పూర్వపు మఠాధిపతి కొడుకులు వెంకటాద్రిస్వామి.. వీరంభట్లయ్య స్వామి.. దత్తాత్రేయస్వామి కూలిన ఇంటి భాగాన్ని పరిశీలించారు. త్వరలోనే పునర్ నిర్మాణాన్ని చేపడతామని చెప్పాలి. మొత్తంగా వందల ఏళ్ల నాటి ఇల్లు కాలగర్భంలో కలిసిపోయిందని చెప్పాలి.