 
    గత నాలుగు రోజులుగా ఏపీలో తీవ్ర స్థాయి ప్రకంపనలు సృష్టించిన మొంథా తుఫాను తీవ్ర తుఫానుగా మారి.. తీరం దాటిన విషయం తెలిందే. దీంతో ఏపీలో ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే.. తాజాగా ఈ ఎఫెక్టు.. తెలంగాణపై పడింది. మొంథా తుఫాను ప్రభావంతో ఏకంగా 16 జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. దీంతో సర్కారు అన్ని అస్త్ర శస్త్రాలతో సన్నద్ధమైంది.
ఎలాంటి పరిస్థితినైనా తట్టుకుని ప్రజలను కాపాడుకుంటామని.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలి పారు. ఆకస్మిక వరదలకు తోడు.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావ రణ శాఖ హెచ్చరికలనేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశామన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను యుద్ధప్రాతిపదికన తరలిస్తుమన్నారు. అంతేకాదు.. ప్రభావిత జిల్లాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా.. ఇప్పటికే చర్యలు చేపట్టినట్టు మంత్రి వివరించారు.
అయితే.. తెలంగాణను కూడా వ్యతిరేక ప్రచారం వేధిస్తోందని మంత్రి భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఉద్దేశ పూర్వకంగా చేస్తున్న ప్రచారంతో ప్రజలలో భయాందోళనలు కలుగుతున్నాయ న్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారాన్ని ప్రజలకు అందిస్తోందని తెలిపారు. ఈ సమయంలో కేంద్రం నుంచి కూడా తమకు మద్దతు అవసరమన్న భట్టి.. రాష్ట్రంలో బీజేపీ నాయకులు.. ఆదిశగా కృషి చేయాలని హితవు పలికారు.
ఆకస్మిక వరదలు వచ్చే జిల్లాలు:
నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, కరీంనగర్, జనగామ, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి. అదేవిధంగా ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా.. సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులకు ఇప్పటికే పలు సూచనలు చేసినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.