 
    మాజీ సీఎం జగన్ పై ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బెంగుళూరు ప్యాలెస్ లో సేద తీరుతున్న జగన్ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మొంథా తుపాను వంటి విపత్కర పరిస్థితుల్లో ఏ రాజకీయ నాయకుడైనా సరే ప్రజలకు సాయం చేసేందుకు చూస్తారని, కానీ, జగన్ మాత్రం విష రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దొంగ మీడియాను అడ్డుపెట్టుకనొ ప్రభుత్వంపై జగన్ అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు, తుపాను వల్ల జరిగిన నష్టంపై ఉన్నతాధికారులతో లోకేశ్ సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక అంచనాలు త్వరితగతిన రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై ఆయన ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండి బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కాగా, నిన్న అర్ధరాత్రి మొంథా తుపాను తీరం దాటే వరకు అమరావతిలోని ఆర్టీజీఎస్ కార్యాలయంలోనే లోకేశ్ ఉన్నారు. మంత్రి నారాయణ, హోం మంత్రి అనితతో కలిసి పరిస్థితిని సమీక్షించారు.