పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్ కోసం భారత్ చేసిన పోరాటం అంతా ఇంతా కాదు.ఒకానొక దశలో పాక్‌స్థాన్ సైనికుల ను నిర్బంధించి బంగ్లాకు స్వేచ్ఛావాయువులు ఊదింది. అంతేకాదు.. బంగ్లాకు వరదలు ముంచెత్తినప్పుడు.. నిట్టనిలువుగా మునిగిన ఆదేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఊదిన దేశం కూడా భారతే. అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ భారత్‌కు చెందిన సహా యంతో చేపట్టిన నిర్మాణాలు కనిపిస్తాయంటే అతిశయోక్తికాదు. అలాంటి బంగ్లాదేశ్.. ఇప్పుడు భారత్‌ను కెలుకుతోంది. భారత్ ను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది. నిజానికి బంగ్లాదేశ్ సామర్థ్యం ఎంత? ఆర్థిక పరిస్థితి ఎంత? అంటే.. `అదొక శలభం(దోమ)` అంటారు.. అంతర్జాతీయ పరిశీలకులు.
 
నిన్న మొన్నటి వరకు అంతర్గత చిచ్చుతో రగిలిన.. బంగ్లాకుప్రస్తుతం యూనస్ ఓ తాత్కాలిక, ఆపద్ధర్మ ప్రధాని మాత్రమే. కానీ.. ఆయన తెచ్చిపెట్టుకున్న కండలు చూపిస్తూ.. భారత్‌పై కవ్వింపులకు దిగుతున్నారు. తాజాగా జరిగిన రెండు పరిణామాలు కూడా.. భారత్‌లో చర్చనీయాంశం అయ్యాయి. 1) భారత్ ఎప్పటి నుంచో నిషేధం విధించి, మోస్ట్ వాంటెడ్ నేరస్తుల జాబితాలో చేర్చిన జాకీర్ నాయక్‌ను బంగ్లాదేశ్ ప్రధాని తన దేశానికి ఆహ్వానించారు. నిజానికి జాకీర్.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం ద్వారా మతకలహాలు ప్రోత్సహించాడు. అంతేకాదు.. ఉగ్రవాదులకు క్లాసులు కూడా చెప్పారన్న అభియోగాలు కూడా ఉన్నాయి. నిజానికి జకీర్ బాధిత దేశాల్లో బంగ్లాదేశ్ కూడా ఉంది. అయినా..యూనస్ ఇప్పుడు భారత్‌ను కవ్వించేందుకు ఆయనను స్వాగతిస్తుండడం గమనార్హం.
 
మరో కీలక విషయం.. రెండోది.. భారత భూభాగాలను.. తమ భూభాగాలుగా పేర్కొంటూ మ్యాప్‌ను రూపొందించడం. భారత్‌కు ఉన్న భూభాగాల్లో ఈశాన్య రాష్ట్రాలు కొన్ని చైనాతోను.. మరికొన్ని బంగ్లాదేశంతోనూ సరిహద్దులు పంచుకుంటున్నాయి. వీటిలో అయితే.. సెవన్ సిస్టర్స్‌గా పిలిచే ఈ ఏడు ఈశాన్య రాష్ట్రాలను కూడా తమ పరిధిలో కలుపుకొని.. మ్యాప్‌ను రూపొందించే సాహసం చేసింది.అంతేకాదు.. ఇదీ మా విస్తీర్ణం అంటూ.. రూపొందించిన ఓ పుస్తకాన్ని భారత్ శతృదేశం పాకిస్థాన్‌కు కానుక గా ఇవ్వడం మరో రెచ్చగొట్టే వ్యవహారంగా నిపుణులు చెబుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆచి తూచి ఆలోచన చేస్తోంది. ఏ చిన్న తేడా వచ్చినా.. ఇటీవల పాక్ కు చెప్పినట్టే తగిన బుద్ధి చెప్పాలని భావిస్తోంది.
 
ఎందుకు శతృత్వం?
 
అసలు బంగ్లాదేశ్ భారత్‌కు అత్యంత మిత్రదేశం. ఒకరకంగా చెప్పాలంటే.. భారత్‌కు జలుబు చేస్తే.. బంగ్లాలో తుమ్ములు వస్తాయన్న టాక్ వినిపించేది. ముజిబుర్ రహ్మాన్ నుంచి ఇటీవల షేక్ హసీనా వరకు కూడా అందరూ మిత్రులుగానే ఉన్నారు. అంతేకాదు.. ప్రస్తుత యూనస్ కూడా భారత్‌కు ఒకప్పుడు మిత్రుడే. మరి ఇప్పుడు ఎంతుకు శతృత్వం పెంచుకున్నారన్నది ప్రశ్న. దీనికి కారణం.. షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడమే. ప్రస్తుతం ఆమె భారత్‌లోని ఓ ప్రాంతంలో రహస్యంగా జీవిస్తున్నారు. ఈమెను అప్పగించాలని యూనస్ ప్రభుత్వం భారత్‌ను వేడుకుంది. అయితే.. అంతర్జాతీయ చట్టాల పరిధిలో బంగ్లాదేశ్ లేనందున.. భారత్ ఈ విషయంలో మౌనంగా ఉంది. దీనిని వంకగా చూపుతూ.. బంగ్లాదేశ్ అటు పాక్‌తో చెలిమి చేస్తూ.. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలను తమవేనని ప్రకటించుకునేపన్నాగం పన్నింది.