బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు చనిపోయారు. తన బావ సత్యనారాయణ భౌతికకాయానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. హరీశ్ రావును, తన సోదరి లక్ష్మిని కేసీఆర్ పరామర్శించారు.
తన బావతో ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, సత్యనారాయణ పార్థివ దేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సత్యనారాయణ రావు నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా సత్యనారాయణ రావుకు నివాళులర్పించి, హరీశ్ రావు కుటుంబాన్ని పరామర్శించారు.