కృతజ్ఞత.. ఇది చాలా పెద్దపదమే. కానీ, విధేయతకు.. మనల్ని ఆదరించిన వారి విషయంలో చూపించా ల్సిన గౌరవానికి మర్యాదకు మాత్రం ఇదే నిఖార్సయిన పదం. కానీ, రాను రాను ఈ కృతజ్ఞత మారుతోంది. రాజకీయాల్లో సరే.. నాయకులు కప్పల తక్కెడ మాదిరిగా.. వ్యవహరిస్తున్నారు. వారికి కృత జ్ఞత ఉందా.. లేదా? అని సమాజం కూడా ఆలోచన చేయడం లేదు. ఎక్కడ ఎవరికి అవకాశం ఉంటే.. అక్కడ అలా వ్యవహరిస్తున్నారు. కానీ.. ఉన్నత చదువులు చదివి.. ఉన్నత స్తాయి ఉద్యోగాలు చేసిన వారు కూడా అలానే ఉంటే? ఏమనాలి?. ఏం చెప్పాలి?
 
అంతేకాదు.. వారిని కాపాడిన వారికి, అమాతం ఎత్తి నెత్తిన పెట్టుకున్నవారికి మొండి చేయి చూపిస్తే.. ఏమ నాలి? ఎలా వారిని భావించాలి? విమర్శలకు అతీతంకాని ప్రజాస్వామ్యంలో అలాంటి వారిపై నిఖార్సయి న విమర్శలు రాకుండా ఉంటాయా?.. ఇదే ఇప్పుడు టీడీపీలో చర్చకు దారితీయగా.. వైసీపీ వెకిలి నవ్వులు నవ్వుతోంది. విషయం ఏంటంటే.. ఏపీలో మాజీ ఐపీఎస్ అధికారి.. ఏబీ వెంకటేశ్వరావు గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలియని వారు ఉండరు. వైసీపీ పాలనలో జాతీయస్థాయిలోనూ పేరు వినిపించింది.
 
ఏబీకి పెద్ద చరిత్రే ఉంది. టీడీపీ హయాంలో చంద్రబాబు ఏరికోరి మనోడు అనుకుని.. ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్టును అప్పగించారు. అప్పటికి కొందరు అధికారులు సీనియర్లుగా ఉన్నా.. వారిని పక్కన పెట్టి ఏబీ సామర్థ్యానికి పెద్దపీట వేశారు. ఇది అంత తేలిక విషయం కాదు. చాలా మంది కోర్టులను, క్యాట్‌ను ఆశ్ర యించి.. ఏబీకి ఎసరు పెట్టాలని చూసినప్పుడు.. చంద్రబాబు చక్రం సంధించి.. కాపాడుకున్నారు. ఇక, అత్యంత కీలకం.. వైసీపీ హయాంలో ఏబీపై తీవ్ర అభియోగాలు మోపి.. ఉద్యోగం నుంచి పక్కన పెట్టి.. జీతం కూడా ఇవ్వకుండా చుక్కలు చూపించారు.
 
అలాంటి సమయంలో బాబు ముందుండి న్యాయపోరాటం చేయించారన్నది పోలీసు వర్గాలే ఆనాడు చెప్పాయి. బలమైన లాయర్లను.. గంటకు లక్షల్లో తీసుకునేవారిని పురమాయించి.. చంద్రబాబు ఏబీకి న్యాయం జరిగేలా చేశారు. ఆ తర్వాత.. కూడా ఏబీపై ప్రేమ కురిపించారు. తాను అధికారంలోకి రావడంతోనే.. వైసీపీ హయాంలో పెండింగులో పెట్టిన కోటి రూపాయలకు పైగా సొమ్మును(జీతం) ఒకేసారి ఇచ్చేశారు. అంతేకాదు.. వాటికి వడ్డీ కూడా కలిపి వచ్చారు. అంతేనా? . ఆయన రిటైర్ అవడంతో .. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డుకు చైర్మన్ పదవిని ఇచ్చారు.
 
ఇంత చేస్తే.. ఎంత కృతజ్ఞత చూపించాలి? ఎంత విధేయతగా ఉండాలి?. పోనీ.. ఆగిపోయిన జీతం భత్యం ఇచ్చారన్న విషయంలోరూల్స్ ఉంటాయి కాబట్టి ఇచ్చారని అనుకుందాం. కానీ.. పదవులు? బలమైన న్యాయవాదులను పురమాయించి.. కేసుల్లో విజయం దక్కేలా చేయడం.. అంతేకాదు.. కూటమిసర్కారు కాగానే.. వైసీపీ పెట్టిన కేసులు ఎత్తేయడం.. వంటివి కృతజ్ఞతకు నోచుకోవా?!. కానీ..ఏబీ ఇవన్నీ మరిచిపో యి.. వైసీపీకి వంత పాడినట్టు.. కందుకూరు ఘటన సహా రైతుల సమస్యలు.. అవినీతి అంటూ.. ప్రభుత్వంపైనా.. ముఖ్యంగా సీఎం చంద్రబాబును పరోక్షంగా విమర్శించడంపైనా టీడీపీలోనే కాదు.. మేధావుల మధ్య కూడా చర్చ సాగుతోంది.