మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి పీటలెక్కబోతుందా? త్వరలోనే తన లైఫ్ పార్ట్‌నర్‌ను అందరికీ పరిచయం చేయబోతుందా? అంటే అవునన్న అనుమానమే కలుగుతోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. మూడు ఇండస్ట్రీల్లోనూ తమన్నా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. నార్త్ లో చిన్నపాటి రోల్స్‌తో కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు.. ఆ తర్వాతి కాలంలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. టాప్ హీరోలకు మోస్ట్ వాంటెడ్‌గా మారింది.
ఇప్పటికీ తమన్నా గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా స్టార్ హీరోల పక్కన ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అదేవిధంగా వెబ్ సిరీస్‌లు, ఐటెం సాంగ్స్, బాలీవుడ్ లో స్పెషల్ రోల్స్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. అయితే ఇండస్ట్రీలో వచ్చిన రెండు దశాబ్దాలు అవుతున్న తమన్నా పెళ్లి చేసుకోలేదు. ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉండే ఆమె, వ్యక్తిగత జీవితంలో వెనకబడే ఉంది. కొంత కాలం క్రితం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమాయణం నడిపింది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా వార్తలు వచ్చాయి. కానీ పెళ్లి వరకు వెళ్లకుండానే విజయ్ - తమన్నా బ్రేకప్ చేసుకున్నారు.
ప్రస్తుతం సింగిల్ గానే ఉంది.. కానీ త్వరలోనే తనకు కాబోయే వాడ్ని చూస్తారంటూ పెళ్లిపై తమన్నా గుడ్‌న్యూస్ పంచుకుంది. తాను యాక్ట్ చేసిన లేటెస్ట్ వెబ్ సిరీస్ `డూ యూ వాన్నా పార్ట్‌నర్` స్ట్రీమింగ్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా.. తన జీవిత భాగస్వామి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. `మంచి లైఫ్ పార్ట్నర్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు. గత జన్మలో ఎంత పుణ్యం చేస్తుంటే నాకు తమన్నా లాంటి భార్య దొరికిందని నా భర్త ఆనందపడాలి. అందుకోసమే నా ప్రయత్నం. అయితే ఆ లక్కీ పర్సన్ ఎవరనేది నాకు తెలీదు. కానీ త్వరలోనే అతన్ని మీరంతా చూస్తారేమో` అంటూ తమన్నా చెప్పుకొచ్చింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తమన్నా మళ్లీ ప్రేమలో పడిందా అన్న కొత్త డౌట్స్ ను రేకెత్తిస్తున్నాయి. ఏదేమైనా తమన్నా మాటలు బట్టి చూస్తుంటే మరికొద్ది రోజుల్లో ఆమె సింగిల్ లైఫ్ కు టాటా చెప్పబోతుందని అర్థమవుతుంది.