టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తేజ సజ్జా నుంచి వచ్చిన మరో సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా `మిరాయ్`. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్ కాగా.. మంచు మనోజ్, శ్రియా శరన్, జగపతి బాబు, జైరాం, గెటప్ శ్రీను తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు. భారీ అంచనాల నడుమ నేడు పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన మిరాయ్ కు సూపర్ హిట్ టాక్ లభిస్తోంది.
మిరాయ్ తొమ్మిది గ్రంథాల చుట్టూ తిరిగే కథ. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు తన శక్తులను 9 గ్రంధాల్లో దాచి ప్రపంచ పటంలో అనేక ప్రదేశాల్లో పెడతాడు. ఆ గ్రంధాలను కాపాడే వాళ్ళూ ఉంటారు. కానీ ఈ గ్రంధాలను దక్కించుకుని శక్తిమంతుడు అవ్వాలని మహావీర్ లామా(మంచు మనోజ్) ప్రయత్నిస్తాడు. అతను మొదలు పెట్టిన పోరాటాన్ని వేద(తేజ) యోధగా మారి ఎలా అడ్డుకున్నాడు..? ఈ క్రమంలో వేద తెలుసుకున్న నిజాలేంటి? వేద పుట్టుక వెనుక రహస్యమేంటి..? అన్నదే అసలు కథ.
హానుమాన్ తర్వాత మరోసారి తేజ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ లో చెలరేగిపోయాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. విలన్‌గా మంచు మనోజ్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. హీరోయిన్ రితిక పర్వాలేదు. తేజ తల్లిగా శ్రియా బాగా ఆకట్టుకుంది. జగబపతిబాబు, జయరాం మిగిలిన యాక్టర్స్ తమ పాత్రల మేరకు మెప్పించారు. అలాగే కార్తీక్ ఘట్టమనేని ఓవైపు దర్శకుడిగా, మరోవైపు సినిమాటోగ్రాఫర్‌గా తన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు. అతని విజువల్ ప్రెజెంటేషన్ బిగ్ స్క్రీన్ అనుభవం ఇస్తుంది.
హాలీవుడ్ స్థాయిలో రూపొందించిన కొన్ని సీన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సప్తపది గరుడ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఫస్టాప్ లో కాస్త కామెడీ కోసం ట్రై చేసినా అంతగా వర్కోట్ కాలేదు. అయితే ఇంటర్వెల్, ఫ్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అన్నీ మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్, వీఎఫ్ఎక్స్ విజువల్స్ టాప్‌నాచ్. గౌర హరి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా టోన్‌ను హైలైట్ చేస్తుంది. `బ్రహ్మాస్త్ర` తరహా స్టోరీ, పాత్రలు అనిపించినా దానిని తలదన్నేలా మిరాయ్ సినిమాను రూపొందించారు. నిర్మాణ విలువలు ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. తక్కువ బడ్జెట్ లోనే సాలిడ్ ప్రాజెక్ట్ లు కూడా చేయవచ్చు అని మిరాయ్ నిర్మాతలు నిరూపించారు.
అయితే సినిమాకు ప్లాస్‌లు ఉన్నట్లే మైనస్‌లు కూడా ఉంటాయి. మిరాయ్ మూవీకి స్క్రీన్ ప్లే కాస్త మైనస్ అయింది. సినిమాలో ప్రధానాంశం బాగున్నప్పటికీ స్క్రీన్‌ప్లేను ఇంకొంచెం గ్రిప్పింగ్ గా రాసుకుని ఉంటే బాగుండేదని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. అలాగే `వైబ్ ఉంది` లాంటి సాంగ్స్ ని తీసేయడం ప్రేక్షకులను నిరాశపరిచింది. ఓవరాల్ గా చూసుకుంటే మిరాయ్ బొమ్మ బ్లాక్ బస్టర్. కొన్ని సినిమాలను థియేటర్స్ లోనే ఎక్స్‌పీరియెన్స్ చేయాలి. మిరాయ్ అటువంటి మూవీనే!