వైసీపీ అధినేత జగన్‌కు.. ఇప్పుడు ఉన్న పరిస్థితి వేరు.. రాబోయే కాలం వేరు.. అన్నట్టుగా ఏపీలో రాజకీ యాలు మారుతున్నాయి. జగన్‌ను కేవలం రాజకీయంగానే కాదు.. మానసికంగా కూడా కుంగిపోయేలా కూ డా వ్యూహాత్మకంగా ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. దీనిని ఎదుర్కొనే విషయంలో వైసీపీ నానాటి కీ వెనుకబడుతోందన్న చర్చ కూడా ఉంది. మరి మున్ముందు.. ఈ వ్యూహాలు మరింత పెరిగితే.. జగన్‌కు దబి డి దిబిడేనన్న వాదన వినిపిస్తోంది. అయితే.. వైసీపీలో ఎలాంటి వ్యూహాలు కనిపించడం లేదు. ఎదుర్కొనే తీరు కూడా తెరమీదికి రావడం లేదు.
ఏం జరిగింది?
వైసీపీ హయాంలో తీసుకు వచ్చిన మద్యం విధానంలో 3500 కోట్ల రూపాయల వరకు అక్రమాలు జరిగాయ ని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ కూడా సాగి స్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 43 మందిని నిందితులుగా పేర్కొంటూ.. కేసులు నమోదు చేశారు. ప లువురిని కూడా అరెస్టు చేశారు. ఇక, ఈ అక్రమ సొమ్మును వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టారని, సిని మాలు తీశారని.. తలా పెద్ద ఎత్తున పంచుకున్నారని కూడా సిట్ అధికారులు దాఖలు చేసిన చార్జిషీట్‌లో పేర్కొన్నారు.
అయితే.. ఇదంతా ఒక ఎత్తు. వాస్తవానికి ఇది తొలినాళ్లలో ప్రజల మధ్య కు వెళ్లినా.. తర్వాత తర్వాత.. ఈ వ్యవహారం సాగదీతగా మారింది. దీంతో ప్రజల మధ్య పెద్దగా చర్చకు రావడం లేదు. దీనిని గమనించిన ఓ వర్గం... తాజాగా వెబ్ సిరీస్‌ను తీసిన విషయం తెలిసిందే. దీనిని సోషల్ మీడియాలో చూచాయగా విడు దల చేశారు. దీనిని వాస్తవానికి యూట్యూబ్‌లో లేదా.. ఇతర ప్లాట్ ఫామ్స్‌లో పెట్టాలని చూస్తున్నారు. ఇది లావుంటే.. ఇప్పటి వరకు వెబ్ సిరీస్ తొలి భాగానికి ఏకంగా లక్షల సంఖ్యలో వ్యూస్ పడ్డాయి.
వారికి కావాల్సింది కూడా ఇదే. పేపర్లు చదివే వారు తక్కువ మంది ఉన్నారు. చదివినా పెద్దగా ప్రజల మధ్యకు చేరలేదన్న భావన కూడా ఉంది. ఇలాంటి సమయంలో వెబ్ సిరీస్ రావడం.. మద్యం- డబ్బు-విషం పేరుతో అందరికీ కనెక్టయ్యేలా.. ఏఐని వినియోగించి రూపొందించిన ఈ సిరీస్ చాలా వరకు కనెక్ట్ అయింది. దీనిని యూట్యూబ్‌లో పెడితే.. మరింతగా ప్రజలకు చేరువ అవుతుంది. దీంతో అసలు మద్యం కేసులో ఏం జరిగిందన్నవిషయం ప్రజలకు సునాయాశంగా తెలిసిపోతుంది.
అంతేకాదు.. ఈ సిరీస్‌లో సాధారణ ప్రజల అభిప్రాయాలను, అధికారంలోకి రాకముందు.. వచ్చిన తర్వా త.. లిక్కర్ విషయంలో జగన్ అనుసరించిన విధానాలు.. మద్యం ధరలు పెంచిన తీరు.. ఆయన వ్యవహా రం.. మృతులు ఇలా అనేక విషయాలను దీనిలో పేర్కొన్నారు. దీంతో ఇది అత్యంత వేగంగా ప్రజలకు కనెక్ట్ అవడం ఖాయం. ఇదే జరిగితే.. జగన్ పరువు నేలమట్టం అవుతుందన్న అంచనా వుంది. వాస్తవానికి ఇలాంటివి వెలుగు చూసినప్పుడు.. తక్షణమే స్పందించి అడ్డుకోవాలి. కానీ, ఆ తరహా ప్రయత్నాలు ఎక్కడా చేయక పోవడం గమనార్హం. దీంతో జగన్‌కు దబిడి దిబిడేనన్న వాదన వినిపిస్తోంది.