రాజీనామాపై రాజీ పడనన్న రాజా సింగ్

admin
Published by Admin — September 11, 2025 in Telangana
News Image

తెలంగాణ బీజేపీ మాజీ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గురించి పరిచయం అక్కర లేదు. స్వపక్షమయినా...విపక్షమయినా...నిర్మొహమాటంగా కొన్ని సార్లు...వివాదాస్పదంగా కొన్ని సార్లు మాట్లాడడం రాజా సింగ్ నైజం. ఆ తరహా వ్యాఖ్యలు చేసినందుకే రాజా సింగ్ పై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేస్తారని అంతా భావించారు. కానీ, రాజా సింగ్ మాత్రం తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, ఏం చేసుకుంటారో చేసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను నిన్న..ఈ రోజు..రేపు...బీజేపీనే అని తేల్చి చెప్పారు. బీజేపీ పెద్దలు పిలిస్తే వెళ్లి వారికి తెలంగాణ బీజేపీలో జరుగుతున్న అన్ని విషయాలు చెబుతానని అన్నారు. తిరిగా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే, బీజేపీ తప్పుచేసినప్పుడల్లా తాను మాట్లాడుతూనే ఉంటానని రాజాసింగ్ తెగేసి చెప్పారు. కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే తాను కూడా చేస్తానని, ఎన్నికలకు వెళ్లేందుకు కిషన్ రెడ్డి సిద్ధమా అని ప్రశ్నించారు.

Tags
won't resign mla post says ex bjp leader raja singh
Recent Comments
Leave a Comment

Related News