ఏపీ మంత్రి పొంగూరు నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై ఆయ న వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ``జగన్‌ని జనాలు నమ్ముతారని అనుకుంటున్నారా?`` అని వ్యాఖ్యానించా రు. అంతేకాదు.. మరో అడుగు ముందుకు వేసి.. ``జగన్‌ని ఆయన ఇంట్లో వాళ్లే నమ్మరు. జనం ఎలా న మ్ముతారు`` అని ఎద్దేవా చేశారు. తాజాగా బుధవారం అనంతపురంలో జరుగుతున్న `సూపర్ సిక్స్-సూపర్ హిట్` భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. బుధవారం ఉదయమే అనంతపురం చేరుకున్న మంత్రి.. ఇక్కడి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తోందని, అభివృద్ధి సంక్షేమా న్ని రెండు కళ్లుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ముందుకు తీసుకువెళ్తున్నారని నారాయణ చెప్పా రు. ఇప్పటి వరకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని.. దీనివల్ల పేదల కుటుంబాల్లో వెలుగులు నిండాయన్నారు. ఇది వైసీపీ అధినేత జగన్‌కు కంటగింపుగా మారిందని నారాయణ విమర్శించారు. అందుకే.. కూటమి సర్కారుపై లేనిపోని విమర్శలు చేస్తూ.. కాలం వెళ్లదీస్తున్నారని వ్యాఖ్యానించారు.
``అదేంటోకానీ.. ఆయన సోషల్ మీడియాలో అన్నీ వ్యతిరేక వార్తలే వస్తున్నాయి. దీనిని ఆయనైనా నమ్ముతాడో లేదో తెలియదు. ప్రజలు మాత్రం నమ్మరు. ఇంకో మాట. జగన్‌ను ఆయన ఇంట్లో వాళ్లే(ఎవరు అనేది చెప్పలేదు) నమ్మరు. ఇక, జనాలు ఎలా నమ్ముతారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రభుత్వం పట్ల ప్రజలు నమ్మకంతో ఉన్నారు. సుపరిపాలనకు మంచి మార్కులు వేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు సంపూర్ణంగా అమలయ్యాయి. అందుకే.. ఈ సభను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నాం. ఈ విషయం జగన్ తెలుసుకోవాలి. ముందు ఆయన చెప్పింది.. ఆయన ఇంట్లో వాళ్లయినా.. నమ్మేలా వ్యవహరించాలి`` అని మంత్రి నారాయణ చురకలు అంటించారు.
ఇదిలావుంటే.. బుధవారం జరిగే సభ ద్వారా సూపర్ 6 హామీలపై సీఎం, డిప్యూటీ సీఎంలు కీలక అంశాలు ప్రస్తావిస్తారని మంత్రి నారాయణ చెప్పారు. అదనంగా ఎవరైనా లబ్ధిదారులు ఉన్నప్పటికీ.. వారికి కూడా న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ విషయంలో ఎవరూ అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. రైతులకు యూరియా బాగానే సరఫరా అవుతోందని.. వైసీపీ నాయకులకు సరఫరా ఆగిపోయి ఉంటుందని.. అందుకే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు.