భారత పొరుగు దేశం నేపాల్‌లో చోటు చేసుకున్న అంతర్గత కుమ్ములాటలు, విద్యార్థులు, యువత చేపట్టి ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేపాల్ ఒకరకంగా తగలబ డిందనే చెప్పాలి. ఈ క్రమంలో అక్కడ అనేక దేశాలకు చెందిన పౌరులు చిక్కుకుపోయి.. బయటకు రాలేక, అక్కడ ఉండలేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గృహ దహనాలు కూడా.. గత రాత్రి నుంచి చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇతర దేశాల నుంచి వచ్చి.. అక్కడ ఉద్యోగాలు చేసు కుంటున్నవారిపై.. స్థానిక యువత దాడులు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
ఈ పరిణామాలతో నేపాల్‌లో ఉన్న తెలుగు వారు..(రెండు రాష్ట్రాలకు చెందిన) తీవ్ర సంకట స్థితిలో ప్రాణా లు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. తమను స్వదేశానికి తీసుకురావాలని అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో తక్షణమే స్పందించిన మంత్రి నారా లోకేష్.. హుటాహుటిన అమరావతికిచేరుకుని ఆర్టీజీఎస్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో అధికారులతో భేటీ అయ్యారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారిని ఏపీకి తీసుకువచ్చే అంశంపై ఆయన అధికారులతో చర్చించారు. తాను కూడా వచ్చే 24 గంటల పాటు అందుబాటులో ఉంటానని తెలిపారు.
అయితే.. వాస్తవానికి బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి అనంతపురం జిల్లాలో కూటమి ప్రభుత్వం `సూపర్ సిక్స్-సూపర్ హిట్` పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది. బుధవారంతో రాష్ట్రంలో కూటమి ఏర్పడి 15 మాసాలు పూర్తయ్యాయి. ఈ 15 మాసాల్లో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను.. ప్రజలకు వివరించే ఉద్దేశంతో సుమారు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు కూడా వస్తున్నారు.
అంతేకాదు.. స్వయంగా నారా లోకేష్.. కేంద్రం పెద్దలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. తాను కూడా మధ్యాహ్నం 12 గంటలకే అనంతపురం చేరుకుని.. కేంద్రం పెద్దలను రిసీవ్ చేసుకోవాల్సి ఉంది. అయి తే.. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారి యోగక్షేమాలే తనకు ముందు.. అంటూ.. ఆయన అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రానికే పరిమితం అవుతున్నట్టు తెలిపారు. అనంతపురం సభకు వెళ్లడం లేదన్నారు. ఇది ఒక రకంగా త్యాగమేనని చెప్పాలి. ముఖ్యంగా తన విద్యాశాఖ కు సంబంధించిన అనేక సంస్కరణలు, డీఎస్సీ వంటివాటిని, అదేవిధంగా విద్యార్థుల తల్లులకు ఇచ్చిన తల్లికి వందనం పథకాలను ఆయన వివరించాలని అనుకున్నారు. కానీ, తెలుగు వారు ఇబ్బందుల్లో ఉన్నారని తెలియడంతో ఈ సభను త్యాగం చేసి.. అమరావతికే పరిమితం అవుతున్నట్టు స్పష్టం చేశారు.