భక్తులకు దాదాపు 15 రకాల వంటకాలతో అరిటాకులో విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలు చూసేందుకు పోలీస్ కమిషనర్ తో పాటు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ హాజరయ్యారు. వినాయకుడి విగ్రహానికి, భక్తులకు ప్రత్యేక భద్రత కల్పించారు. చిన్నారులు నాట్య ప్రదర్శనలతో అందరినీ అలరించారు. లడ్డూ వేలంపాట కూడా ఆసక్తిగా జరిగింది. £5700 పౌండ్లకు లడ్డూ వేలం పాట పాడి భక్తులంతా సిండికేట్ గా కలిసి పంచుకున్నారు.
ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డోలు వాయిద్యం భక్తులను తన్మయత్వానికి గురి చేసింది. పోలీస్ ఎస్కార్ట్ తో గణేష్ నిమజ్జనం జరిగింది. బర్మింగ్‌హామ్ కాలువలో వినాయకుడి విగ్రహం నిమజ్జనం చేసి భక్తులంతా వీడ్కోలు పలికారు.
ఈ వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికీ, ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు కృషి చేసిన వాలంటీర్లకు గణేష్ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.