అమెరికాలోని బోస్టన్ నగరంలో ‘భారతీయ డెలిగేషన్ ఆఫ్ హానరబుల్ లెజిస్లేటర్స్ ఎట్ ఇంటర్నేషనల్ కెపాసిటీ ఎన్హాన్స్ మెంట్ ప్రోగ్రామ్-2025‘ జరిగింది. శాసనసభ్యులకు సంబంధించిన ఈ సదస్సుకు టీడీపీ నేత, ఆముదాలవలస ఎమ్మెల్యే, ఇంజనీర్ కూన రవి కుమార్ హాజరయ్యారు. మన దేశం నుంచి 165 మంది ప్రజాప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి రవి కుమార్ ఒక్కరే హాజరచయ్యారు. ఈ సందర్భంగా బోస్టన్ లో ప్రవాసాంధ్రులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా కూన రవి కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కూన రవి కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, ఐటీ రంగంలో డెవలప్మెంట్ కోసం లోకేశ్ చేస్తున్న కృషిని యావత్ ప్రపంచం కొనియాడుతోందని ఆయన అన్నారు. శ్రీకాకుళంలోని ఇండస్ట్రీస్ కారిడార్ కు ఎన్నారైలు తమ వంతు సహాయసహకారాలివ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నిలపడమే తమ ప్రభుత్వం ఉద్దేశ్యమని చెప్పారు. పార్టీ కోసం తెలుగు తమ్ముళ్లు, ఎన్నారైలు చేసిన కృషిని కొనియాడారు.
ఈ సమావేశంలో తెలుగు తమ్ముళ్లను అంకినీడు ప్రసాద్ ఆహ్వానించారు. గత ఎన్నికలల్లో లక్షల్లో దొంగ ఓట్లను ఏరిపారేసిన వైనాన్ని సభికులకు సూర్య తేలప్రోలు వివరించారు. చంద్రబాబు హయాంలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని, పారదర్శకంగా పాలన చేస్తున్న తీరును S4 మీడియా అధినేత శ్రీ బోళ్ల కొనియాడారు చక్కటి విందుతో ముగిసిన ఈ సమావేశానికి సంపత్ కట్ట, విజయ్ బెజవాడ, త్రిభువన్ పారుపల్లి, గోపి నెక్కలపూడి, శేషుబాబు కొంతం, రాజేందర్, కృష్ణ ప్రసాద్ సోంపల్లి, రాఘవ నన్నూరి, చంద్ర తాళ్లూరి, కళ్యాణ్ కాకి, రవి ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.