యాపిల్ బ్యూటీ హన్సిక మరోసారి హెడ్‌లైన్స్ లో నిలిచింది. భర్త సోహైల్ ఖతురియాకు హన్సిక దూరంగా ఉంటోందని.. ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారని గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా సోహైల్ విడాకుల వార్తలను ఖండించడంతో అందరూ రూమర్స్ అనుకున్నారు. కానీ తాజాగా భర్తకు విడాకులు ఇస్తున్నట్లు హన్సిక పరోక్షంగా కన్ఫార్మ్ చేసింది.
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు తమ వైవాహిక బంధానికి ముగింపు పలికే ముందు సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు డిలీట్ చేస్తున్నారు. ఇప్పుడు హన్సిక కూడా ఇదే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ అమ్మడు తాజాగా తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి వెళ్లి ఫోటోలను, వీడియోలను తొలగించింది. ఈ పరిణామంతో హన్సిక, సోహైల్ విడిపోవడం ఖాయమని అంటున్నారు. మ్యారేజ్ ఫోటోస్ డిలీట్ చేసి డివోర్స్‌ను హన్సిక అఫీషియల్ చేసేసిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
కాగా, 2022 డిసెంబర్ 4న తన చిరకాల ప్రియుడు, వ్యాపారవేత్త సోహైల్ ఖతురియాను హన్సిక పెళ్లి చేసుకుంది. జైపూర్‌లోని ముండోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్‌లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. అయితే సోహైల్‌కు ఇది రెండో పెళ్లి. మొదట అతను 2016లో హన్సిక బెస్ట్ ఫ్రెండ్ రింకీతో ఏడడుగులు వేశాడు. అప్పట్లో వీరి వెడ్డింగ్‌కు హన్సిక కూడా హాజరైంది. కానీ పెళ్లి జరిగిన కొన్ని నెలలకే ఫస్ట్ వైఫ్‌తో సోహైల్ విడిపోయాడు. ఆ తర్వాత సోహైల్, హన్సిక మధ్య ఉన్న పరిచయం ప్రేమ, పెళ్లి వరకు వెళ్లింది. ఇప్పుడు విడాకులతో ఈ జంట తమ బంధానికి ఎండ్ కార్డ్ వేయనున్నారని కథనాలు వెలువడుతున్నాయి.