తమిళ స్టార్ హీరో ధనుష్ తో ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రేమాయణం నడిపిస్తుందా అంటే సోషల్ మీడియా నుంచి అవునన్న సమాధానమే వినిపిస్తోంది. ధనుష్ గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకుని ఇద్దరు కుమారులకు జన్మనిచ్చారు. అయితే కొంతకాలం క్రితం ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ధనుష్ పర్సనల్ లైఫ్ కు సంబంధించి అనేక వార్తలు తెరపైకి వచ్చాయి.
ముఖ్యంగా సీనియర్ బ్యూటీ మీనా తో ధనుష్ రెండో వివాహం జరగబోతుందని కోలీవుడ్ మీడియా కోడై కోసింది. కానీ ఈ వార్తలను మీనా ఖండించారు. ఇటువంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. తాజాగా ధనుష్, మృణాల్ డేటింగ్ చేస్తున్నారంటూ బలంగా టాక్ వినిపిస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఈమధ్య ధనుష్, మృణాల్ పదేపదే జంటగా కనిపిస్తున్నారు.
ఈ ఏడాది జూలైలో ధనుష్, మృణాల్ ముంబైలో జరిగిన ఒక పార్టీలో కనిపించారు. ధనుష్ అప్ కమింగ్ ఫిల్మ్ `తేరే ఇష్క్ మే` టీమ్ ఇచిన పార్టీ ఇది. హీరోయిన్ కృతి సనన్, ధనుష్‌లతో పాటు ఏమాత్రం సంబంధం లేని మృణాల్ కూడా ఆ పార్టీకి హాజరు కావడం డేటింగ్ వార్తలకు తెర లేపింది. అలాగే ఆగస్టు 1న మృణాల్ బర్త్‌డే పార్టీ జరిగింది. ఈ పార్టీకి ధనుష్ అటెండ్ కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. మృణాల్ యాక్ట్ చేసిన `సన్ ఆఫ్ సర్దార్ 2` మూవీ ప్రీమియర్ లో కూడా ధనుష్ సందడి చేశాడు.
ఈ క్రమంలో మృణాల్ మరియు ధనుష్ చాలా సన్నిహితంగా కనిపించడం, చేతులు పట్టుకుని క్లోజ్ గా మాట్లాడుకోవడం వంటి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తుఫాను రేపుతోంది. ధనుష్ తో మృణాల్ ప్రేమాయణం నడుపుతున్న మ్యాటర్ ఈ ఒక్క వీడియోతో లీక్ అయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొందరైతే మృణాల్ రాంగ్ ట్రాక్‌లో వెళ్తుందని.. ఆమెకు ధనుష్ కారెక్ట్ కాదని సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు.
#Dhanush was welcomed by #MrunalThakur at #SonOfSardaar2 Premiere..⭐ pic.twitter.com/YB8tXjSuEO
— Laxmi Kanth (@iammoviebuff007) July 31, 2025