ఏపీ మాజీ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఆరేళ్లుగా కొనసాగుతూ..ఉన్న సంగతి తెలిసిందే. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ విచారణలో జాప్యం జరుగుతోందని, ఈ కేసును తెలంగాణకు బదిలీ చేయాలని వివేకా తనయురాలు సునీతా రెడ్డి కోరారంటే ఆ కేసులో జగన్ ఏ రేంజ్ లో శ్రద్ధ వహించారో అర్థం చేసుకోవచ్చు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ వేగవంతమైంది.
ఈ క్రమంలోనే ఈ కేసులో తమ దర్యాప్తు పూర్తయిందని సీబీఐ తాజాగా వెల్లడించింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు అధికారికంగా సీబీఐ అధికారులు చెప్పారు.
ఈ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలకు ప్రకారం ముందుకు వెళ్తామని సీబీఐ అధికారులు తెలిపారు. జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ ధర్మాసనం మరోసారి ఈ కేసును విచారణ జరపనుందని తెలుస్తోంది. ఏది ఏమైనా వివేకా కేసులో అసలు దోషులకు శిక్ష్ పడాలని సునీత కోరుకుంటున్నారు.