ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే పీ-4 సహా క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటివాటికి పెద్దపీట వేస్తున్న విష యం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆయన మరో సరికొత్త ఐడియాతో ముందుకు వచ్చారు. ప్రజలు(పీపుల్)-దూరదృష్టి( విజన్)-ప్రకృతి(నేచర్)-సాంకేతికత(టెక్నాలజీ)లతో పాలనను ముందుకు నడిపించాలని నిర్ణయించారు. సహజంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు.. విజన్‌ను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తున్నాయి. అయితే.. దీనికి ప్రజలను, ప్రకృతిని, సాంకేతికతను కూడా జోడించడం ద్వారా మరింత మెరుగైన పాలనను ప్రజలకు చేరువ చేయొచ్చని చంద్రబాబు నిర్ణయించారు.
ఈ విషయంపై ఆయన అధికారులకు సోదాహరణంగా వివరించారు. ప్రజలు(పీపుల్)-దూరదృష్టి( విజన్)-ప్రకృతి(నేచర్)-సాంకే తికత(టెక్నాలజీ)లతో పాలన సాగించడం ద్వారా రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ది దిశగా నడిపించేందుకు అవకాశం ఉంటుంద న్నారు. ముఖ్యంగా ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు, ప్రకృతిని పరిరక్షించుకునేందుకు, అదేసమయంలో సాంకేతికతను సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకునే అవకాశం కూడా ఉంటాయని అధికారులకు వివరించారు. దీనిని సంపూర్ణంగా పాలనకు జోడించడం ద్వారా రాష్ట్రం మరో కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడం ఖాయమని వ్యాఖ్యానించారు.
``ఏదైనా ప్రారంభంలో అనేక ఇబ్బందులు వస్తాయి. కానీ, వాటిని సవాలుగా తీసుకుని అడుగులు వేయడంద్వారా సాధించవ చ్చు. ఏదీ అసాధ్యం కాదు. ఒకప్పుడు కంప్యూటర్ అంటే.. సాధ్యం కాదని అనుకునేవారు. కానీ.. ఇప్పుడు ప్రతిఇంట్లోనూ కంప్యూటర్ వచ్చింది. ఇది కూడా అంతే`` అని చంద్రబాబు అధికారులకు సూచించారు. ప్రజలను ప్రకృతికి, సాంకేతికతకు.. అనుసంధానం చేయడం ద్వారా విజన్ వైపు నడిపించవచ్చని తెలిపారు. తద్వారా వారి జీవన ప్రమాణాలు కూడా పెరుగుతా యని.. ఆదాయ వృద్ధి కూడా పెరుగుతుందని వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం రూ.3,47,871 సాధించాలని దిశానిర్దేశం చేశారు.
అదేసమయంలో భవిష్యత్తుకు సంబంధించి లక్ష్యాలు కూడా పెట్టుకోవాలని చంద్రబాబు సూచించారు. 2029 నాటికి రూ. 5.42 లక్షలు తలసరి ఆదాయం లక్ష్యంగా పెట్టుకోవాలని.. దీనికి ప్రజలు-ప్రకృతి-విజన్-సాంకేతికతు దోహదపడతాయన్నారు. సమా జంలోని ప్రజలను ఒక యూనిట్‌గా తీసుకుని స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక లక్ష్యాలకు అనుగుణంగా విజన్ ఏర్పాటు చేసుకుంటే.. సాధించడం కష్టమేమీ కాదన్నారు. ప్రభుత్వంతోపాటు.. ప్రజలు కూడా.. అన్ని రంగాల్లోనూ సహకరించేందుకు ముందుకు వస్తారని.. తద్వారా ఏపీని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చూడడం సాధ్యమేనని చెప్పారు.