ఏపీలో గతంలో కేవలం ప్రైవేటు పాఠశాలల్లో మాత్రమే నో అడ్మిషన్ బోర్డులు కనిపించేవి. కొన్ని ప్రైవేటు స్కూల్లో అడ్మిషన్ కోసం రికమండేషన్లు కూడా నడిచేవి. కానీ, ప్రభుత్వం మారింది. రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ కొలువుదీరింది. దీంతో, ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ విషయంపై విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
ఆదోనిలోని మున్సిపల్ నెహ్రూ మెమోరియల్ హైస్కూల్ లో నో అడ్మిషన్ బోర్డు పెట్టడం లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాడి అన్ని తరగతుల్లో కలిపి 400 మందికి పైగా కొత్త అడ్మిషన్లు జరిగాయి. ఆ స్కూల్లో మొత్తం 1725 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో, ఆ స్కూల్ ముందు 'నో అడ్మిషన్' బోర్డు దర్శనమిచ్చింది.
దీంతో, ఆ వ్యవహారంపై లోకేశ్ స్పందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి ఆదోని పాఠశాలే ఒక చక్కటి ఉదాహరణ అని ఆయన అన్నారు. "నో అడ్మిషన్ బోర్డు చూసి చాలా ఆనందించానని, అడ్మిషన్లు ముగిశాయని చెబుతున్నా తల్లిదండ్రులు వినడం లేదని అన్నారు.