ఏపీలో ఇప్పుడు అందరి చూపు పులివెందుల పైనే పడింది. ఒంటిమిట్టతో పాటుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. జడ్పీటీసీ సభ్యులు మహేశ్వర్ రెడ్డి మూడేళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో.. పులివెందుల స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఎన్నిక చిన్నదే అయిన ఎలక్షన్ ఫైట్ మాత్రం వేరే లెవల్ లో సాగుతోంది.
వాస్తవానికి పులివెందుల అంటేనే జగన్ అడ్డా. జెడ్పీటీసీ సీటును వైసీపీ సునాయసంగా గెలుచుకోవచ్చు. కానీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో అక్కడ వైసీపీ గ్రాఫ్ అనేది కాస్త డౌన్ అయింది. దీంతో సొంత ఇలాకాలో వైసీపీని ఓడించేందుకు సైకిల్ పార్టీ స్కెచ్చేసింది. ఎన్నికల బరిలో టీడీపీ అభ్యర్థిగా నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి సతీమణి లతా రెడ్డిని దింపింది. బీటెక్ రవికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. గతంలో ఇతనే జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డిపై ఎమ్మెల్సీగా గెలిపొందారు. ఈ సారి కూడా విజయంపై ధీమాగా ఉన్నారు.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలను దక్కించుకుని వైసీపీకి, జగన్‌కు షాక్ ఇవ్వాలని టీడీపీతో పాటు కూటమి పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. టీడీపీ తరఫున జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, బీజేపీ నుంచి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నిమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. జనసేన నాయకత్వం సైతం పూర్తి మద్దతు ఇస్తోంది. మరోవైపు వైసీపీ ఎలాగైనా పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని గెలిచి రాబోయే స్థానిక సంస్థలకు ఇప్పటినుంచే క్యాడర్, లీడర్లకు బూస్టింగ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది.
పులివెందులలో వైసీపీ తరఫున చనిపోయిన జెడ్పీటీసీ కుమారుడు అభ్యర్థిగా ఎన్నికయ్యరు. ఈ బైఎలక్షన్ పై ఏకంగా ఎంపీ అవినాశ్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. వై నాట్ పులివెందుల అంటూ అన్ని తానై చూసుకుంటున్నారు. పోలింగ్ లోపు నిజయోకవర్గంలో జగన్ పర్యటన ఉండేలా కూడా ప్రణాళిక రచిస్తున్నారట. దీంతో పులివెందుల పాలిటిక్స్ హీటెక్కాయి. అయితే ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ ఓడిన పెద్ద నష్టమేమి జరగదు. కానీ ఏదైనా తేడా వచ్చి పొరపాటున వైసీపీ ఓడిపోతే మాత్రం జగన్ పరువు గల్లంతే అని అంటున్నారు.