ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకులోకి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలేసి మరీ యాక్టింగ్ వైపు అడుగుల వేసిన కిరణ్ అబ్బవరం.. మొదట షార్ట్ ఫిల్మ్స్ లో నటించాడు. ఆ తర్వాత వెండితెరపై `రాజా వారు రాణి గారు` మూవీతో హీరోగా అడుగుపెట్టి తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ఉత్తమ డెబ్యూ హీరోగా సైమా అవార్డును సొంతం చేసుకున్నాడు.
ఆ తర్వాత సెలెక్టివ్ గా కథలను ఎంపిక చేసుకుంటూ తనదైన టాలెంట్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. గత ఏడాది `క` మూవీతో భారీ హిట్ కొట్టాడు. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. తన తొలి సినిమా హీరోయిన్ అయిన రహస్య గోరక్ తో ప్రేమలో పడి ఆమెతోనే ఏడడుగులు వేశాడు. 2024 ఆగస్టులో కర్ణాటక కూర్గ్‌లోని ఒక ప్రైవేట్ రిసార్ట్ లో గ్రాండ్ గా ఈ జంట వివాహం చేసుకున్నారు.
ఈ ఏడాది మేలో కిరణ్-రహస్య దంపతులకు పండంటి మగ బిడ్డ జన్మించారు. అయితే తాజాగా కుమారుడుతో కలిసి తొలిసారి కిరణ్ అబ్బవరం, రహస్య శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే తిరుమలలోనే తనయుడికి నామకరణం కూడా చేశారు. సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ టైమ్ కొడుకు ఫేస్ ను చూపించిన కిరణ్ అబ్బవరం.. బాబుకు `హను అబ్బవరం` అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఇక పంచ కట్టు, నుదుటిన నామాలు పెట్టుకొని కిరణ్ తనయుడు సూపర్ క్యూట్ గా కనిపిస్తుండడంతో నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.