శాన్ జోస్ లో ICAC ప్రారంభం...ఇంటి వద్దకే కాన్సులేట్ సేవలు!

admin
Published by Admin — August 02, 2025 in Nri
News Image

ఆగస్టు 1 నుండి అమెరికాలోని శాన్ జోస్ లో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, శాన్ ఫ్రాన్సిస్కో తీపి కబురు అందించింది. శాన్ జోస్ లో ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్(ICAC) ను అమెరికాలో భారత రాయబారి(అంబాసిడర్ ఆఫ్ ఇండియా ఇన్ యూఎస్ఏ) వినయ్ క్వాత్రా వర్చువల్ గా ప్రారంభించారు. ప్రారంబోత్సవ సమయంలో కాన్సుల్ జనరల్ డాకర్టర్ శ్రీకర్ రెడ్డి ఐసీఏసీ కార్యాలయంలో ఉన్నారు. ఆయనతో పాటు భారతీయ డయాస్పొరా నాయకులు కూడా ఉన్నారు.

ఆగస్టు 1, 2025 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని క్వాత్రా పేర్కొన్నారు. ఇక్కడి ప్రవాస భారతీయులకు కాన్సులేట్ సేవలను ఇంటివద్దకే తీసుకువచ్చామని, ఆ సేవలను మరింత విస్తరించేందుకే ఐసీఏసీని ప్రారంభించామని తెలిపారు.

బోస్టన్, కొలంబస్, డల్లాస్, డెట్రాయిట్, అడిసన్, ఓర్లాండో, రాలీ మరియు శాన్ జోస్..మొత్తం 8 నగరాల్లో దీనిని ప్రారంభించనున్నామని ఆయన చెప్పారు. ఈ కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ల ద్వారా కాన్సులర్ సేవలు మరింత విస్తరిస్తామని తెలిపారు. ఐసీఏసీ ద్వారా కాన్సులర్ సేవలను మరింత వేగంగా శక్తివంతంగా అందిస్తామన్నారు. భారతీయ డయాస్పోరాకు కాన్సులేట్ సేవలను సులభతరం చేయబోతున్నామని అన్నారు.

ఇకపై శాన్ జోస్ లో పాస్ పోర్ట్, వీసా, ఓసీఐ, పవర్ ఆఫ్ అటార్నీ, బర్త్ అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్స్, అటెస్టేషన్స్, ఎన్ వో ఆర్ ఐ I/II/III, పీసీసీ (విదేశీయుల కోసం), లైఫ్ సర్టిఫికెట్(నాన్ పెన్షన్) తదితర సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఫార్మ ఫిల్లింగ్, ఫొటోగ్రాఫ్స్, ఫొటోకాపీ, రిటర్న్ కొరియర్ తదితర సేవలు ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండానే అందించనున్నారు. ఆగస్టు 1 నుండి అన్ని ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్లు సోమవారం నుంచి శనివారాల్లో తెరిచి ఉంటాయి. అపాయింట్ మెంట్ ద్వారా ఈ సేవలు పొందవచ్చు.

ఐసీఏసీ అడ్రస్:

San Jose ICAC: Suite D100, 1580-1630 Old Oakland Road, San Jose, CA

ఈ కింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి మరిన్ని వివరాలు పొందవచ్చు

services.vfsglobal.com/usa/en/ind/

News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
Tags
ICAC San Jose USA NRI Indian Consulate Consular
Recent Comments
Leave a Comment

Related News

Latest News