మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డికి ఏపీ హైకోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఆమెకు 17 కోట్లు జరిమానా విధించింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు తమకు ఎదురేలేదన్నట్టుగా వ్యవహరించారు. వైసీపీ అధినేత జగన్ రిషి కొండపై కన్నేస్తే.. ఆయనకు అత్యంత సన్నిహితుడు, వైసీపీ మాజీనేత విజయసాయిరెడ్డి భీమిలి బీచ్ ను కబ్జా చేశారు. కుమార్తె నేహా రెడ్డి పేరు మీద భారీ రిసార్ట్స్ నిర్మించే ప్రయత్నం చేశారు.
అందులో భాగంగానే సీఆర్జెడ్(కోస్టల్ రెగ్యులేషన్ జోన్) నిబంధనను ఉల్లంఘిస్తూ బీచ్ లో చాలా లోతుగా తవ్వి గోడలు కూడా నిర్మించారు. ఈ వ్యవహారాన్ని తొలిత జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మీడియా ముఖంగా బయటపెట్టారు. న్యాయ పోరాటానికి కూడా దిగగా.. అప్పట్లో హైకోర్టు పర్యవరణ శాఖ నివేదికల ప్రకారం ఆర్జెడ్ నిబంధనలను అతిక్రమిస్తూ నేహా రెడ్డి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించింది. నిర్మాణంలో ఉన్న రిసార్ట్‌లను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
అధికారులు న్యాయస్థానం ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలను తొలగించారు. కానీ ప్రహరీ కోసం బీచ్ లో ఆరడుగుల మీర వేసిన పునాదులను మాత్రం అలాగే వదిలేశారు. ఈ విషయంపై తాజాగా హైకోర్టు సీరియస్ అయింది. ఈ పునాదులు పర్యవారానికి హాని కలిగిస్తాయని.. బీచార్ లో అక్రమ నిర్మాణాలు చేసినందుకు రోజుకు రూ. 1.20 లక్షలు చొప్పున 1455 రోజులకు ర. 17 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రిసార్ట్స్ నిర్మాణాల కోసం తవ్విన ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉంది. అవి పూర్తయ్యే వరకూ అదనంగా రోజుకు రూ. 1.2 లక్షలు కట్టాల్సి ఉందని.. మూడు నెలల్లో పునరుద్ధరించకపోతే జరిమానా రెట్టింపు అవుతుందని న్యాయస్థానం తెగేసి చెప్పింది. ఈ తీర్పుతో అటు సాయిరెడ్డితో పాటు ఇటు కూమార్తెలో కూడా టెన్షన్ స్టార్ట్ అయింది.