సింగపూర్ లోని ప్రవాసాంధ్రులతో చంద్రబాబు ఫొటో సెషన్... నెవ్వర్ బిఫోర్... ఎవ్వర్ ఆఫ్టర్!

admin
Published by Admin — July 30, 2025 in Andhra
News Image

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వయసు గురించి వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఏడు పదుల వయసులోనూ ప్రజల కోసం, టీడీపీ కార్యకర్తల కోసం, అభిమానుల కోసం అహర్నిశలు శ్రమిస్తూ తనకు వయసు ఒక నెంబర్ మాత్రమే అని ఆయన నిరూపిస్తూనే ఉంటారు. తాజాగా సింగపూర్ పర్యటన సందర్భంగా చంద్రబాబు ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేశారు.

ఒకటి కాదు... రెండు కాదు...దాదాపుగా 8 వేల ఫోటోలు దిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఫోటో సెషన్ కు ముందు రోజు రాత్రి చంద్రబాబు హైదరాబాద్ నుండి సింగపూర్ కు విమాన ప్రయాణం చేశారు. నాలుగు గంటల ప్రయాణంలో ఆయన సరిగా నిద్రపోలేదు. ప్రయాణ బడలిక ఉన్నప్పటికీ తనకోసం వచ్చిన ప్రవాసాంధ్రులతో సెల్ఫీలు దిగేందుకు చంద్రబాబు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. అది కూడా ఒక్కొక్క కుటుంబంతో ఒక్కొక్క ఫోటో విడివిడిగా దిగారు.

ముందుగా 10 మంది సభ్యులను ఒక గ్రూపుగా చేసి ఫోటో దిగుదామని అనుకున్నారు. కానీ, కుటుంబాల వారీగా దిగితే బాగుంటుందని భావించి అందరితో ఓపిగ్గా చంద్రబాబు సెల్ఫీలు దిగిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బహుశా ఈ రకంగా ఫోటోలు దిగడం చంద్రబాబుకే చెల్లింది. ఇది చరిత్రాత్మకమని చంద్రబాబుతో ఫోటోలు దిగిన ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సింగపూర్ లోని ప్రవాసాంధ్రులతో చంద్రబాబు సెల్ఫీలు... నెవ్వర్ బిఫోర్... ఎవ్వర్ ఆఫ్టర్! అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

https://drive.google.com/drive/folders/1LFM_WX9_CdOqMNplAOBAWsQ_qv7Ls1nq

News Image
Tags
CM Chandrababu Singapore
Recent Comments
Leave a Comment

Related News