ఏకగ్రీవాలపై కూటమి ఫోకస్!

admin
Published by Admin — October 14, 2026 in Andhra
News Image

కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం జ‌రుగుతున్న స్థానిక ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. వ‌చ్చే న‌వంబ‌రులోనే దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్ రానుంది. అయితే.. రెండు వ్యూహాల‌తో రాజ‌కీయంగా ముందుకు సాగాల‌ని కూట‌మి నేత‌లు నిర్ణ‌యించారు. 1) సాధ్య‌మైన‌న్ని ఏక‌గ్రీవాలు చేసుకోవ‌డం. ఇది అనుకున్న‌ట్టుగా జ‌రిగితే.. దాదాపు అన్ని స్థానిక ఎన్నిక‌లు కూడా కూట‌మికి ప్ల‌స్ కానున్నాయి. అయితే.. క్షేత్ర‌స్థాయిలో కూట‌మి పార్టీలైన టీడీపీ, జ‌న‌సే న‌, బీజేపీల మ‌ధ్య స‌మ‌న్వ‌యం మ‌రింత అవ‌స‌రం అవుతుంది.

 

ప్ర‌స్తుతం పైకి కూట‌మినాయ‌కులు బాగానేఉ న్న‌ట్టు క‌నిపిస్తున్నా.. అంత‌ర్గ‌తంగా మాత్రం ఆధిప‌త్య ధోర‌ణి క‌నిపిస్తు న్నార‌న్న‌ది వాస్త‌వం. దీనిని త‌గ్గించాల్సిన అవ‌స‌రం ఉంది. అలానే.. సీట్లు ఆశిస్తున్న వారిని శాంత ప‌ర‌చ‌డం కూ డా ముఖ్య‌మే. దీనిని సానుకూలంగా మార్చుకుంటే.. కూట‌మి ఏక‌గ్రీవాలు చేసుకునే విష‌యంలో ఎలాంటి ఇబ్బం దులు రాక‌పోవ‌చ్చ‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే స‌మ‌న్వ‌య క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌స్తుతం ఈ క‌మిటీ లు క్షేత్ర‌స్థాయిలో తమ ప‌నిని ప్రారంభించాయి.

 

ఇక‌, రాజ‌కీయంగా దూకుడు విష‌యానికి వ‌స్తే.. వైసీపీ పై పైచేయి సాదించేందుకు కూట‌మి ప్ర‌య‌త్నాలు ముమ్మ రం చేసింది. దీనిలో భాగంగా.. వైసీపీకి బ‌లంగా ఉన్న మండ‌లాలు, జిల్లాల జాబితాను రెడీ చేసుకున్న పార్టీ.. ఆయా చోట్ల కూట‌మి నేత‌ల‌ను గెలిపించే బాధ్య‌త‌ను ప్ర‌త్యేక స‌మ‌న్వ‌య క‌ర్త‌ల‌కు కేటాయించింది. ఇది పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మైన వాయిస్ వినిపించేందుకు వైసీపీ ఎత్తుగ‌డ‌ల‌కు చెక్ పెట్టే విధంగా వ్యూహాలు ప్రిపేర్ చేస్తున్నారు. ప్ర‌తి జిల్లా ఇంచార్జ్ మంత్రిని దీనిలో భాగ‌స్వామ్యం చేయ‌డం గ‌మ‌నార్హం.

 

పై స్థాయిలో సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేష్‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌లుకూడా.. ఈ ఎన్నిక‌ల ప్ర‌చారం లో కీల‌క పాత్ర పోషించ‌నున్నారు. ఇదేస‌మ‌యంలో ఇత‌ర ముఖ్య నేత‌ల‌నుకూడా రంగంలోకి దింపుతున్నారు. ఇక‌, సోష‌ల్ మీడియా ద్వారా కూడా భారీ ఎత్తున ప్ర‌చారం చేయ‌నున్నారు. ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల‌ను వినియోగించుకునే విషయం తుది ద‌శ‌కు చేరుకున్న నేప‌థ్యంలో ఈ నెల ఆఖ‌రులోగానే వారు ప‌నిప్రారంభిస్తారు. ఇలా.. స్థానిక ఎన్నిక‌ల‌ను అన్ని కోణాల్లోనూ అన్ని వైపుల నుంచి సానుకూలంగా మార్చుకునేందుకు కూట‌మి కీల‌క ప్ర‌య‌త్నం చేస్తోంది.

Tags
NDA alliance in ap focus on local body elections
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News