చోడ‌వ‌రం పాలిటిక్స్‌: ధ‌ర్మ‌శ్రీకి దారి క‌ష్ట‌మేనా..?

admin
Published by Admin — September 12, 2026 in Politics, Andhra
News Image

అనకాపల్లి జిల్లాలోని చోడవరం నియోజకవర్గం అత్యంత కీలకమైన, ఆసక్తికరమైన స్థానాల్లో ఒకటి. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య సుదీర్ఘ కాలంగా హోరాహోరీ పోరు సాగుతోంది. ప్రస్తుత చోడవరం ఎమ్మెల్యే కలిదిండి సూర్య నాగ సన్యాసి రాజు (కేఎస్ఎన్‌ఎస్ రాజు). 2024 లో జరిగిన  ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు. ప్రధాన ప్రత్యర్థి వైసీపీ కీలక నేత,అప్ప‌టి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ(Karanam Dharmasri)ని ఓడించారు.

2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభావంతో ఇక్కడ కేఎస్ఎన్‌ఎస్ రాజు(KSNS Raju) భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ త‌ర్వాత‌.. నియోజకవర్గంపై త‌న‌ పట్టును నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నా రు. అయితే.. గతంలో గెలిచిన కరణం ధర్మశ్రీ ఓటమి పాలైనప్పటికీ, నియోజకవర్గంలో  క్యాడర్‌ను యాక్టి వ్‌గా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, ఆయ‌న‌కు పెద్ద‌గా ఇక్క‌డ గ్రాఫ్ పెర‌గ‌డం లేదు. పార్టీ ప‌రంగా కూడా నాయ‌కులు క‌లిసి రావ‌డం లేద‌ని అంటున్నారు.

చోడవరం(Chodavaram) నియోజకవర్గంలో కాపు, గవర, వెలమ వంటి సామాజిక వర్గాల ఓట్లు అత్యంత కీల‌కం. పార్టీ ఏదై నా అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో ఈ ఓటు బ్యాంకు అత్యంత కీలకంగా ప‌నిచేస్తోంది. ప్రస్తుతం చోడవరంలో అధికార కూటమి బలంగా ఉండగా, ప్రతిపక్ష వైసీపీ క్షేత్రస్థాయిలో మాట‌ల‌కే ప‌రిమితం అయింది. అంతేకాదు.. ఈ నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ నాయ‌కుల మ‌ధ్య అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు కూడా జ‌రుగుతున్నాయి. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎలాంటి ప‌రిస్థితి చోటు చేసుకుంటుందోన‌న్న చ‌ర్చ వైసీపీలో ఎక్కువ‌గా ఉంది.

ధ‌ర్మ‌శ్రీ ఒక్క‌సారే..
ప్ర‌స్తుత ఎమ్మెల్యే రాజుతో పోల్చుకుంటే.. వైసీపీ నేత ధ‌ర్మ‌శ్రీ.. ఒక్క‌సారి మాత్ర‌మే విజ‌యం ద‌క్కించుకున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో టిడిపి(TDP) నుంచి పోటీ చేసిన సన్యాసిరాజు  కరణం ధర్మశ్రీ పై 1385 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా సన్యాసిరాజు మరోసారి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మాత్రం వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన కరణం ధర్మశ్రీ గెలుపు గుర్రం ఎక్కారు. అప్ప‌ట్లో త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజయం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నా..  టిడిపి అభ్యర్థిగా ఉన్న సన్యాసిరాజు దూకుడు ముందు.. ధ‌ర్మ‌శ్రీ గెలుపు క‌ష్ట‌మ‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags
Chodavaram Politics Karanam Dharmasri KSNS Raju Andhra Pradesh AP Politics Anakapalli TDP YSRCP
Recent Comments
Leave a Comment

Related News