బే ఆఫ్ బెంగాల్ లో వైసీపీని కలిపేస్తారు: చంద్రబాబు

admin
Published by Admin — September 01, 2026 in Politics
News Image

‘‘చంద్రబాబు అనే నేను 1996 మార్చిలో వెలిగొండ ప్రాజెక్టుకు భూమి పూజ చేశాను.. చంద్రబాబు అనే నేను 30 సంవత్సరాల తర్వాత 2026 ఆగస్టులో వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభించి జాతికి అంకితం చేశాను’’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. ఇది తన అదృష్టమని హర్షం వ్యక్తం చేశారు. వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు అని, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభించడం భగవంతుడు తనకు ఇచ్చిన ఒక మంచి అవకాశం అని అన్నారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

ఇటువంటి సందర్భాలు జీవితంలో అరుదుగా వస్తాయని, తనకు మాటలు పెగలడం లేదని అన్నారు. డీఎస్సీపై బురదజల్లితే టీచర్లు తిరగబడ్డారని, వైసీపీ వైఖరి మారకుంటే ఆ పార్టీని బే ఆఫ్ బెంగాల్‌లో కలిపేస్తారని వార్నింగ్ ఇచ్చారు. ఇక, వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్ కొట్టేయాలని జగన్ చూస్తున్నారని, కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ కంటే ఈ ప్రాజెక్టుకు తామే ఎక్కువ చేశామని చంద్రబాబు అన్నారు. 2024 ఎన్నికలకు ముందు హడావిడిగా సినిమా సెట్టింగులు వేసి డ్రామాలాడారని, ఇటువంటి సిగ్గులేని గొడ్డలి పార్టీని ఏమనాలని చంద్రబాబు ప్రశ్నించారు.

Tags
AP CM Chandrababu bay of bengal teachers dsc issue
Recent Comments
Leave a Comment

Related News