ఏపీ(AP)లో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబరులోగా వీటిని నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తొలుత మునిసిపాలిటీలు, తర్వాత కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో గతానికి భిన్నంగా ఈ సారి.. మేయర్ పదవులకు కూడా ప్రత్యక్ష ఎన్నికలు తీసుకువచ్చారు. ఈ క్రమంలో కీలకమైన విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టు వ్యవహారం ఆసక్తిగా మారింది. ఈ సారి ఆసక్తికరంగా సెంట్రల్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత బొండా ఉమామహేశ్వరరావు కుమారుడు బొండా సిద్ధార్థ్ పేరు అనేక ఈక్వేషన్ల మధ్య తెరమీదకు వచ్చింది. బొండా సిద్ధార్థ్ ఇప్పుడు బెజవాడ రాజకీయంలో హాట్ టాపిక్‌గా మారారు.

సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్ బొండా ఉమా(Bonda Uma) తనయుడు, యువ నాయకుడిగా సిద్ధార్థ్‌కు విజయవాడలో మంచి గుర్తింపు ఉంది. సిద్ధార్థ్ .. ఇటీవల కాలంలో ప్రజలకు చేరువ అవుతున్నారు. జెన్‌జీ పేరును తలపోస్తున్న టీడీపీకి సిద్ధార్థ్ విజయవాడలో ఫ్యూచర్ నాయకుడిగా కనిపిస్తున్నారన్న చర్చలు నగర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు తెరమీదకు వచ్చాయి. అంతేకాదు గతంలో తండ్రికి మూడు ఎన్నికల్లోనూ ఎలక్షన్ ఇంజనీరింగ్‌లో కీ రోల్ పోషించిన సిద్ధార్థ్... గత రెండు సంవత్సరాలుగా సెంట్రల్ నియోజకవర్గంలోనే కాకుండా.. విజయవాడలో రాజకీయాలు.. టీడీపీ కార్యక్రమాల్లోనూ చాలా చురుకుగా మూవ్ అవుతున్నారు.
ప్రజల నుంచి వినతులు స్వీకరించడంతోపాటు.. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు సేవా కార్యక్రమాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ చాపకింద నీరులా వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. ఉన్నత విద్యావంతుడు కావడం కూడా సిద్ధార్థ్(Siddharth)కు కలిసి వస్తున్న అంశం. యూత్‌లో సిద్ధార్థ్ కు గట్టి పట్టుండడం.. యూత్ ఐకాన్‌గా ఆయన ఎదుగుతున్న తీరు వంటివి కూడా.. మేయర్ పోస్టుకు పరిశీలన అంశంగా టాక్స్ నడుస్తున్నాయి. తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజా సేవలో ఆయన పాలుపంచుకుంటున్న తీరు.. ప్రజలకు చేరువ అవుతున్న విధానం వంటివి కూడా మేయర్‌గా ఆయన ఈ పదవికి అర్హుడన్న వాదన బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపై విజయవాడ పొలిటికల్ సర్కిళ్లలో జోరుగా చర్చ సాగుతోంది.
.jpg)
యూత్‌కు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు.. కీలకమైన కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న విజయవాడలో ఈ సామా జికవర్గానికి పదవి లభిస్తే.. అది టీడీపీ(TDP)కి రాష్ట్ర వ్యాప్తంగా మైలేజీ తెస్తుందన్న అంచనాలు కూడా వస్తున్నాయి. జనసేన కూటమిలో ఉండడంతో టీడీపీలో కాపులకు ప్రాధాన్యత తగ్గుతోంది. ఇక విజయవాడ, కృష్ణా జిల్లాలో కాపులకు టీడీపీలో ఒకప్పటి గుర్తింపు ఉందా ? అన్నది సందేహమే. ఈ క్రమంలోనే సామాజికంగా బ్యాలెన్స్ చేసేలా బొండా సిద్ధార్థ్ కు ఛాన్స్ ఇస్తే అది కూటమి, టీడీపీకే చాలా అడ్వాంటేజ్ అవుతుందనడంలో సందేహం లేదు.