వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ కలహాలు వీధిన పడ్డాయి. ఆయన కోడలు మేఘన తాజాగా విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మరీ పలు విషయాలు వెల్లడించారు. తనపై జరుగుతున్న దాడు లను సహించేది లేదని.. సమయం చూసుకుని అన్ని విషయాలు బయట పెట్టేస్తానని ఆమె హెచ్చరించా రు. తనను కన్న కూతురులా చూసుకున్నానని, గోరు ముద్దలు తినిపించానని చెబుతున్న మాటలు పచ్చి బూటకమని వ్యాఖ్యానించారు. తనకు విషపు ముద్దలు పెట్టారని ఆమె ఆరోపించారు.
`విషయం` లేదు!
తన భర్త రాజీవ్‌కు విషయం(మగతనం) లేదని మేఘన తెలిపారు. ఈ విషయం తనకంటే ముందే.. తన అత్తకు తెలుసునని.. అయినా అసలు విషయాన్ని దాచి పెట్టి పెళ్లి చేశారని పేర్కొన్నారు. దీనిపై తాను నిలదీసినందుకు.. పెళ్లయిన రెండు మాసాలకే విడాకుల కోసం రాజీవ్ దరఖాస్తు చేశాడని చెప్పారు. దీనిని విజయవాడ కోర్టు కొట్టి వేసిందన్నారు. అయినప్పటికీ తాను సర్దు కు పోయినా.. అదనపు కట్నం కోసం నిరంతరం వేధించారని.. అదనంగా సొమ్ము తెస్తేనే సుఖంగా ఉంటావని బాధించారని తెలిపారు.
వారు హిందువులు కాదు!
జోగి రమేష్ కుటుంబం పైకి చెప్పుకొన్నట్టుగా హిందువులు కాదని మేఘన ఆరోపించారు. వివాహ సమ యంలో నటించారని, హిందువులమేనని చెప్పారని తెలిపారు. కానీ, పెళ్లయి ఇంటికి వచ్చిన తర్వాత వా రు క్రైస్తవులని అర్ధమైందన్నారు. తన అత్తగారు నిత్యం బైబిల్ చదివేవారని, కనీసం ఇంట్లో దీపం కూడా పెట్టుకునే అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు. హిందూ మతాన్ని ఆచరిస్తే.. ద్రోహం అన్నట్టుగా చూశారని, హిందూ దేవుళ్లను దూషించారని తెలిపారు.
సజ్జలకు అన్నీ తెలుసు
వైసీపీ రాష్ట్ర స్థాయి నేత సజ్జల రామకృష్ణారెడ్డికి అన్ని విషయాలు తెలుసునని మేఘన చెప్పారు. ఆయన పరిశీలిస్తానని.. సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చారని, కానీ ఆయన పట్టించుకోలేదన్నారు. జగన్‌ను కలు సుకునేందుకు ప్రయత్నించామని.. కానీ, అప్పాయింట్‌మెంటు ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం తన వద్ద ఉన్న ఆధారాల్లో కొన్ని మాత్రమే బయట పెట్టానని.. మరింతగా తనను వేధిస్తే.. తన వద్ద ఉన్న ఆధారాలను పూర్తిగా బయట పెట్టేస్తానని మేఘన హెచ్చరించారు.