టాలీవుడ్(Tollywood) క్యూట్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ రీసెంట్‌గా పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా తనలోని స్వేచ్ఛను గురించి ఆమె రాసుకొచ్చిన ఆ ఒక్క పోస్ట్ పై ఎవరికి తోచిన విధంగా వారు కథనాలు అల్లారు. అయితే, దీనిపై చాలా కాలం నుంచి మౌనంగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. తన ప్రేమ వ్యవహారం, బ్రేకప్ గురించి మాట్లాడుతూ ఆమె వాడిన పదాలు అందరినీ షాక్‌కు గురిచేస్తున్నాయి. ఒక వ్యక్తితో తాను రెండేళ్లపాటు ఎంతటి మానసిక క్షోభను అనుభవించిందో ఆమె పూసగుచ్చినట్లు వివరించింది. అప్పట్లో తన నిశ్చితార్థం ఆగిపోవడం వెనుక ఉన్న అసలు బాధ ఏంటో ఆమె పరోక్షంగా బయటపెట్టింది.
తన ఎక్స్-బాయ్ ఫ్రెండ్‌తో సాగిన రిలేషన్‌షిప్‌ను వివరిస్తూ అనుపమ(Anupama Parameswaran) చెప్పిన ఉదాహరణ అత్యంత ఆసక్తికరంగా నిలిచింది. ఒక రోజు తనను ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమించే రెమో లాంటి వ్యక్తి కనిపిస్తాడని, అతడు తనను అమితంగా చూసుకునే తీరు చూసి మురిసిపోయానని ఆమె గుర్తుచేసుకుంది. అదొక అద్భుతమైన కలలా అనిపించేదని చెప్పింది. కానీ, సరిగ్గా మరుసటి రోజు ఉదయం సీన్ పూర్తిగా మారిపోయేదని, అదే వ్యక్తిలో తనకి ఒక అపరిచితుడు కనిపించేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనను ఎవరైనా కత్తితో పొడిచినా సరే, కనీసం తిరిగి చూసేవాడు కాదు అన్నట్లు ప్రవర్తించేవాడని.. ఆ తర్వాత రోజు వచ్చి చిన్న పిల్లాడిలా ఏడుస్తూ క్షమాపణలు కోరేవాడని తెలిపింది. అలా మళ్లీ నమ్మి మోసపోవడం, ప్రతీసారి ఇదే తంతు రిపీట్ కావడం తనను మానసికంగా పూర్తిగా కుంగదీసిందని వాపోయింది.
ఆ విషపూరితమైన బంధం నుంచి తాను గనుక సమయానికి బయటపడకపోయి ఉంటే, పరిస్థితి మరోలా ఉండేదని అనుపమ స్పష్టం చేసింది. ఒకవేళ ఆ పెళ్లి పీటల దాకా వెళ్లి ఉంటే, ఆ తర్వాత విడాకులు(Divorce) తీసుకోవాల్సి వచ్చేదేమోనని అభిప్రాయపడింది. ఆ బంధంలో ఉన్నంతకాలం తాను ఏనాడు మనశ్శాంతిగా లేనని, ప్రతీక్షణం ఆందోళనతోనే గడిపానని తెలిపింది.
అంతేకాకుండా, తన కెరీర్‌ను దెబ్బతీసేలా తనను సినిమాలు కూడా మానేయాలని సదరు వ్యక్తి తీవ్రంగా బలవంతం చేశాడని ఆమె సంచలన ఆరోపణలు చేసింది. కాగా, కోలీవుడ్ యువ నటుడు ధృవ్ విక్రమ్(Dhruv Vikram)తో అనుపమ డేటింగ్ చేసి విడిపోయినట్లు కొద్దికాలంగా పెద్ద ఎత్తున రూమర్స్ వినిపిస్తున్న నేపథ్యంలో, ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు ఆ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. అనుపమ ఎక్కడా నేరుగా ఎవరి పేరునూ ప్రస్తావించకపోయినప్పటికీ.. ఎప్పుడైతే అపరిచుతుడు ఎగ్జాంపుల్ చెప్పిందో అప్పుడే అందరికీ ఆమె ఎక్స్ ఎవరు అనేదానిపై ఒక క్లారిటీ వచ్చినట్లైంది.