యువ‌తే టార్గెట్‌.. ఇక రూల్స్ మారాయ్ అంటున్న మోదీ..!

admin
Published by Admin — August 03, 2026 in Politics, National
News Image

దేశ రాజకీమయాల్లో సరికొత్త వ్యూహాలకు తెరలేచింది. ఇప్పటివరకు బహిరంగ సభలు, టీవీ ఇంటర్వ్యూలకే పరిమితమైన అగ్రనేతల ప్రచార శైలిలో ఇప్పుడో మేజర్ షిఫ్ట్ కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న తీరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారుతోంది. గల్లీ నుంచి ఢిల్లీ(Delhi) దాకా యూత్‌తో నేరుగా కనెక్ట్ కావడమే లక్ష్యంగా ఆయన తన రూల్స్ మార్చేసారు. ఎన్నికల హడావుడి కాకుండా, నేరుగా యువత మొబైల్ స్క్రీన్‌లను టార్గెట్ చేస్తూ మోదీ వేస్తున్న అడుగులు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఇకపై పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, నేరుగా సోషల్ మీడియా(Social Media)నే వేదికగా మలుచుకోవాలని ప్రధాని గట్టిగా డిసైడ్ అయ్యారు. అందులోనూ ఇన్‌స్టాగ్రామ్ కేంద్రంగా ఆయన చేస్తున్న వరుస పోస్టులు, వీడియోలు ఈ వ్యూహంలో భాగమే. విద్యార్థి ఉద్యోమాలు, మారుతున్న ట్రెండ్స్‌ను గమనించిన అధినాయకత్వం.. యువతకు ఏది చెప్పాలన్నా డైరెక్ట్‌గా రీచ్ అవ్వడమే బెటర్ అని భావిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రులు సైతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండాలని, ఇన్‌స్టాలో జోరు పెంచాలని ప్రత్యేక ఆదేశాలు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ డిజిటల్ అప్రోచ్‌తో పాటు, యూత్ ఫ్యూచర్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మరో సంచలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'వికసిత భారత్(Vikasit Bharat)' కల సాకారంలో యువతదే కీలక పాత్ర అని నమ్ముతున్న మోదీ.. తాజాగా దేశవ్యాప్తంగా 'నశా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్' అనే భారీ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. కేవలం ఒకట్రెండు రోజులు కాకుండా, ఏకంగా వంద వారాల పాటు (దాదాపు రెండేళ్ల పాటు) నిరంతరంగా ఈ ఉద్యమం కొనసాగనుంది.

యువత(Youth)ను పెడదోవ పట్టించే మాదకద్రవ్యాల మహమ్మారికి చెక్ పెట్టడమే ఈ కార్యక్రమం అసలు ఉద్దేశం. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా క్రీడా పోటీలు, వాకాథాన్‌లు, యోగా, ధ్యాన సదస్సులు, స్ట్రీట్ ప్లేస్ నిర్వహించనున్నారు. ఎన్ఎస్ఎస్, విద్యాసంస్థలు, యూత్ క్లబ్స్‌ను కలుపుకుంటూ దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మలచాలని ప్రభుత్వం భావిస్తోంది.

దేశానికి ఆరోగ్యకరమైన, శక్తివంతమైన యువత అవసరమని మోదీ(Modi) ఎప్పుడూ చెబుతుంటారు. అందుకే ఈ తరమ్‌ను ఆయన 'అమృత తరం'గా అభివర్ణిస్తున్నారు. 2047 నాటికి దేశం అగ్రపథాన నిలవాలంటే, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సృజనాత్మకతను చాటాలని పిలుపునిస్తున్నారు. మొత్తానికి.. ఇన్‌స్టా రీల్స్ నుంచి డ్రగ్స్ వ్యతిరేక పోరాటం వరకు మోదీ వేస్తున్న ప్రతి అడుగు కేవలం యూత్‌ను దృష్టిలో పెట్టుకునే సాగుతుండటం విశేషం.

Tags
Narendra Modi Vikasit Bharat Nasha Mukt Bharat Youth India Gen Z PM Modi Drug Free India Indian Politics
Recent Comments
Leave a Comment

Related News