వాంగ్ చుక్ దీక్ష భ‌గ్నం

admin
Published by Admin — July 18, 2026 in National
News Image

వైద్య విద్య ప్ర‌వేశాల కోసం మేలో నిర్వ‌హించిన నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీకేజీకి బాధ్య‌త వ‌హిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌న్న డిమాండ్‌తో ఢిల్లీలో నిరాహార దీక్ష చేప‌ట్టిన ప్ర‌ముఖ విద్యావేత్త, సామాజిక ఉద్య‌మ‌కారుడు సోన‌మ్ వాంగ్ చుక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శ‌నివారం తెల్ల‌వారుజామున ఆయ‌న దీక్ష చేస్తున్న ప్రాంతానికి మెరుపు వేగంతో వ‌చ్చిన పోలీసులు ఆ ప్రాంతాన్ని త‌మ అధీనంలోకి తీసుకున్నారు. సోన‌మ్‌కు సంఘీభావంగా ఉన్న‌వారిని.. అక్క‌డినుంచి పంపించేశారు.

ఈ క్ర‌మంలో కొంద‌రు పోలీసుల‌తో వాగ్వాదానికి దిగే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. భారీ ఎత్తున బ‌ల‌గాల‌ను మోహ రించిన ఢిల్లీ ప్ర‌భుత్వం సోన‌మ్ వాంగ్ చుక్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయ‌న‌తో దీక్ష‌ను విర‌మించే ప్ర‌య త్నంలో భాగంగానే తాము వ‌చ్చామ‌ని పోలీసులు న‌చ్చ‌జెప్పారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. సోన‌మ్‌ను త‌మ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. సోన‌మ్‌కు ప్ర‌స్తుతం ప్ర‌త్యేక వైద్య సేవ‌లు అందుతున్న‌ట్టు కాక్రోచ్ జ‌న‌తా పార్టీ తెలిపింది.

సంకల్పం భ‌గ్నం కాదు!

సోన‌మ్ వాంగ్ చుక్ దీక్ష‌ను భ‌గ్నం చేసిన‌ప్ప‌టికీ.. త‌మ సంక‌ల్పాన్ని మాత్రం భ‌గ్నం చేయ‌లేర‌ని కాక్రోచ్ జ‌న‌తా పార్టీ పేర్కొంది. ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌ను మోసం చేసిన నీట్ ప‌రీక్ష‌కు బాధ్యులు ఎవ‌రో తేల్చాల్సిందేన‌ని పేర్కొంది. కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర రాజీనామా చేయాల్సిందేన‌ని ప‌ట్టు బ‌ట్టింది. ఇక‌, నీట్ ర‌ద్దుతో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న విద్యార్థుల కుటుంబాల‌ను ఆదుకోవాల‌న్న త‌మ డిమాండ్‌ను నెర‌వేర్చాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కాక్రోచ్ జ‌న‌తా పార్టీ మ‌రోసారి అభ్య‌ర్థించింది.

సోమ‌వారం మార్చ్ ..

జంత‌ర్ మంత‌ర్ నుంచి పార్ల‌మెంటు వ‌ర‌కు సోమ‌వారం త‌ల‌పెట్టిన పాద‌యాత్ర య‌థాత‌థంగా కొన‌సాగుతుంద‌ని కాక్రోచ్ జ‌న‌తా పార్టీ స్ప‌ష్టం చేసింది. పార్ల‌మెంటు వ‌రకు సాగే ఈ యాత్ర‌లో ప్రతిఒక్క‌రూ శాంతి యుతంగా పాల్గొనాల‌ని పిలుపునిచ్చింది. అయితే.. ఈ మార్చ్‌ను భ‌గ్నం చేసేందుకు కొంద‌రు కుట్ర‌లు ప‌న్నే అవ‌కాశం ఉంద ని.. ఈ విష‌యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల‌ని కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చీఫ్ దీప్కే కోరారు. ఇదిలావుంటే.. ఢిల్లీ పోలీసులు మాత్రం.. మార్చ్‌కు ఎలాంటి అనుమ‌తి లేద‌ని తెలిపారు. మ‌రోవైపు.. పార్ల‌మెంటు ప‌రిస‌రాల్లో ఎలాంటి నిర‌స‌న‌లు తెల‌ప‌డానికి వీల్లేద‌ని భ‌ద్ర‌తా సిబ్బంది పేర్కొంటున్నారు.

Tags
Sonam Wangchuk 20 day hunger strike ended forcibly police cockroach janata party resignation prahlad joshi NEET
Recent Comments
Leave a Comment

Related News