అమరావతి: కమ్మ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బ్రహ్మం చౌదరి ఈ ఉదయం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై, మెదడులో రక్తం గడ్డకట్టడం (Blood Clot) కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనే వార్త తీవ్ర ఆవేదన కలిగించిందని గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్ డా. రాజా తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీ బ్రహ్మం చౌదరి గారు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ ప్రజాసేవలో చురుకుగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ కుటుంబం ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థిస్తోంది. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అని అన్నారు.
ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తున్న బ్రహ్మం చౌదరి త్వరగా కోలుకోవాలని పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రవాస తెలుగు సమాజం ప్రార్థించాలని డా. రాజా విజ్ఞప్తి చేశారు.