'ఫార్చ్యూన్ ఇండియా' ప్రకటించిన "మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్" జాబితాలో 'నారా బ్రాహ్మణి'కి స్థానం దక్కడం పట్ల గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్ డాక్టర్ రాజా హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన నారా బ్రాహ్మణి, తన దూరదృష్టి, సమర్థవంతమైన నాయకత్వం, వినూత్న వ్యాపార వ్యూహాలతో హెరిటేజ్ ఫుడ్స్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని 'డాక్టర్ రాజా' కొనియాడారు. ఆమె నాయకత్వంలో సంస్థ కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ అభివృద్ధి దిశగా ముందుకు సాగడం విశేషమన్నారు.
వ్యాపార రంగంలో మహిళలు కూడా అత్యున్నత విజయాలను సాధించగలరనే విషయాన్ని 'నారా బ్రాహ్మణి' మరోసారి నిరూపించారని ఆయన పేర్కొన్నారు. నిబద్ధత, కృషి, దూరదృష్టితో ఆమె సాధించిన ఈ గుర్తింపు దేశవ్యాప్తంగా ఉన్న యువతకు, ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తలకు గొప్ప స్ఫూర్తిదాయకమని అన్నారు.
రాబోయే రోజుల్లో కూడా 'నారా బ్రాహ్మణి' మరిన్ని విజయాలను అందుకోవాలని, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు మహిళల ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేయాలని గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్ 'డాక్టర్ రాజా' ఆకాంక్షించారు.