ఆ కారణంతోనే హైదరాబాద్ కు చెడ్డపేరు: రేవంత్

admin
Published by Admin — July 09, 2026 in Politics
News Image
తెలంగాణ రాష్ట్రం దేశంలో కాదు.. ప్ర‌పంచ స్థాయిలోనే ముందుండేలా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నా మ‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి ప్ర‌జ‌ల నుంచి కూడా స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. ఫ్యూచ‌ర్ సిటీ, బుల్లెట్ ట్రైన్‌తోపాటు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు కూడా రాష్ట్రానికి వ‌స్తున్న‌ట్టు చెప్పారు. ఇక్క‌డ చ‌దివిన వారు ఇక్క‌డే గౌర‌వంగా ఉద్యోగం చేసుకునేలా ఐటీ ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తున్నాయ‌ని తెలిపారు. షాబాద్‌లో ప‌ర్య‌టించిన ఆయ‌న సోలార్ యూనిట్‌ను ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక‌ప్పుడు కుటుంబం కోసం ప్ర‌జ‌ల‌ను పీల్చిన ప్ర‌భుత్వం ఉంద‌ని.. ఇప్పుడు ప్ర‌జ‌ల కోసం.. రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్న ప్ర‌భుత్వం ఉంద‌ని వ్యాఖ్యానించారు. అందుకే ఫ్యూచ‌ర్ సిటీ వంటి అద్భుత న‌గ‌రాన్ని సృష్టిస్తున్నామ‌న్నారు. దీనిలో అంద‌రికీ అవ‌కాశం ఉంటుంద‌న్నారు. రాష్ట్రాన్ని 2047 నాటికి.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా 3 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌(30 ల‌క్ష‌ల కోట్ల‌) ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా మారుస్తున్నామ‌న్నారు.

అన్ని రంగాల‌కూ ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని సీఎం తెలిపారు. భ‌విష్య‌త్తు త‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డేలా అనేక ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తున్నాయ‌ని చెప్పారు. రంగారెడ్డి ప్ర‌జ‌లు త్యాగ‌ధ‌నుల‌ని ఈ సంద‌ర్భంగా సీఎం కీర్తించారు. వారు త‌మ క‌ష్టార్జితంతో సంపాయించుకున్న భూముల‌ను కూడా ప్ర‌భుత్వం కోర‌గానే ఇస్తున్నార‌ని.. దీం తో  ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు అవ‌కాశం క‌లుగుతోంద‌ని చెప్పారు. అలాంటి వారిని రాష్ట్రం  ఎప్ప‌టికీ గుర్తుం చుకుంటుంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా గ‌త‌ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపైనా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ప‌రిశ్ర‌మ‌ల కార‌ణంగా హైద‌రాబాద్‌లో కాలుష్యం పెరిపోయింద‌ని సీఎం చెప్పారు. హైద‌రాబాద్ ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా రూపుదిద్దుకుంటున్నా.. ఇక్క‌డున్న కాలుష్యం కార‌ణంగా న‌గరానికి చెడ్డ‌పేరు వ‌స్తోంద‌ని.. ప్ర‌జ‌లు కూడా జీవించ‌లేని ప‌రిస్థితి నెల‌కొంటోంద‌న్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని హైద‌రాబాద్‌లోని అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌ను ఓఆర్ ఆర్ ఆవ‌ల‌కు పంపించే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అయ్యాయ‌న్నారు. ప‌రిశ్ర‌మ ల య‌జ‌మానులు, ఉద్యోగులు కూడా ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌ని పిలుపునిచ్చారు.  ఈ విష‌యాన్ని రాజ‌కీయంగా వాడుకునేవారికి రాజ‌కీయంగానే బుద్ధి చెబుతామ‌ని హెచ్చ‌రించారు.
Tags
cm revanth reddy hyderabad brand image pollution ruining
Recent Comments
Leave a Comment

Related News