``ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్.. హోం శాఖ మంత్రి అయ్యాక..`` అంటూ.. ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణరాజు ఉరఫ్ ఆర్ ఆర్ ఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై న్యాయవాది, జై భీమ్ భారత్ పార్టీ నేత జడ శ్రావణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ.. ఆర్ ఆర్ ఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఏం జరిగింది?
ఉండి నియోజకవర్గం పరిధిలోని ఆకివీడులోని పెదపాడులో రామాలయ నిర్మాణం జరుగుతున్న విష యం తెలిసిందే. ఈ నిర్మాణాన్ని పూర్తిగా ఓన్ చేసుకున్న రఘురామకు.. దళిత క్రైస్తవులకు మధ్య వివాదం కొనసాగుతోంది. అదేసమయంలో రఘురామకు, తాజాగా రిటైర్ అవుతున్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్, న్యాయవాది జడ శ్రవణ్‌కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇటీవల ఆదివారం ఆకివీడులో నిర్వహించిన సమావేశంలో జడ శ్రావణ్ కుమార్ రఘురామపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దళిత క్రైస్తవులపై నోరు చేసుకుంటే నాలిక చీరేస్తామని, రోడ్డు మీద నిలబెడతామని.. నాలికను పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న పవన్‌కు కానుకగా సమర్పిస్తానని జడ శ్రవణ్‌కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదేసమ యంలో రఘురామపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన రఘురామ.. తనపై శ్రావణ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఫిర్యాదు చేయనని, పవన్ కల్యాణ్ హోం మంత్రి అయ్యాక ఆయనకు ఫిర్యాదు చేస్తానని చెప్పుకొచ్చారు.
దీనికి రీజన్ కూడా చెప్పారు. ``నా నాలిక కోసి.. పవన్ కల్యాణ్‌కు కానుకగా పంపిస్తానని శ్రావణ్‌కుమార్ ప్రకటించారు. కాబట్టి.. పవన్‌కు మాత్రమే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆయన హొం మంత్రి అయ్యాకే ఫిర్యాదు చేస్తా`` అని చెప్పారు. కాగా.. రఘురామ వర్సెస్ జడ శ్రావణ్‌కుమార్ ల మధ్య గత నాలుగు మాసాలుగా వివాదం జరుగుతూనే ఉంది. ఏదో ఒక రకంగా.. తనపై కేసులు పెట్టించుకోవాల న్న ఉద్దేశంతోనే తనను విమర్శిస్తున్నారని రఘురామ వ్యాఖ్యానించారు. తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలన్న వైసీపీ పన్నాగం ప్రకారం వారంతా నడుచుకుంటున్నారని విమర్శించారు.