ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు వెండితెరపై తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో, డ్యాన్స్‌లతో థియేటర్లలో పూనకాలు తెప్పించిన రామ్.. ఇప్పుడు సరికొత్త అవతారంలోకి మారబోతున్నారు. తన కెరీర్‌లో ఎన్నడూ చేయని ఒక భారీ ప్రయోగానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ (#RAPO23) గురించిన అధికారిక ప్రకటన రేపే (జూన్ 29న) గ్రాండ్‌గా జరగబోయే పూజా కార్యక్రమాలతో రానుంది.
ఈ సినిమాలో రామ్ కేవలం హీరోగా మాత్రమే నటిస్తారనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ చిత్రానికి ఆయనే స్వయంగా యాక్షన్ కట్ చెప్పబోతున్నారు. అవును, మీరు విన్నది నిజమే! రామ్ పోతినేని(Ram Pothineni) ఈ సినిమాతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టబోతున్నారు. కేవలం దర్శకత్వమే కాదు.. ఈ చిత్రానికి అద్భుతమైన కథను కూడా ఆయనే అందించడం విశేషం. నటనతో పాటు మెదడుకు పదును పెట్టే సబ్జెక్ట్‌తో మెగా ఫోన్ పడుతుండటంతో టాలీవుడ్‌లో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.
ఇక ఈ సినిమా జానర్ విషయానికి వస్తే.. ఇదొక మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. రామ్ మైండ్ గేమ్‌కు, యాక్షన్ తోడైతే స్క్రీన్ ఏ రేంజ్‌లో బద్దలవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను రామ్ సోదరుడు కృష్ణ పోతినేని తమ సొంత నిర్మాణ సంస్థ 'రాపో సినిమాటిక్స్(RAPO Cinematics)' బ్యానర్‌పై ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించనున్నారు.
సినిమాను విజువల్‌గా నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు స్టార్ సినిమాటోగ్రాఫర్ తిరును రంగంలోకి దించారు. రేపు పూజా కార్యక్రమాలు ముగిసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెగ్యులర్ షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేసేందుకు చిత్రబృందం పక్కా ప్లాన్‌తో ఉంది. హీరోగా కోట్ల మంది గుండెల్లో స్థానం సంపాదించుకున్న రామ్(Ram).. ఇప్పుడు దర్శకుడిగా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి.