ఇట్స్ అఫీషియ‌ల్‌.. అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి ఫిక్స్..!

admin
Published by Admin — June 28, 2026 in Movies
News Image

ఇండస్ట్రీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ గత కొంతకాలంగా నలుగుతున్న మోస్ట్ సెన్సేషనల్ రూమర్‌కు ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చేసింది. కోలీవుడ్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అధినేత కావ్య మారన్ త్వరలోనే వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రేజీ వెడ్డింగ్ వార్తలపై తమిళ ఇండస్ట్రీకి చెందిన ఓ సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చాయి.

చాలా కాలంగా వీరిద్దరి లవ్ లైఫ్ గురించి రకరకాల గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ.. ఇరు వర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, అనిరుధ్‌(Anirudh Ravichander)కు పెద‌నాన్న‌, సీనియర్ నటుడు వై.జి. మహేంద్రన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ క్రేజీ కపుల్ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అనిరుధ్ పెళ్లికి కొన్ని చిన్నచిన్న అడ్డంకులు ఉన్నాయని, అవన్నీ త్వరలోనే తొలగిపోయి కావ్య మారన్‌తో అతని వివాహం జరగడం ఖాయమని ఆయన ఓపెన్‌గానే హింట్ ఇచ్చారు. 

ఈ సందర్భంగా కావ్య మారన్ వ్యక్తిత్వాన్ని ఆయన ఆకాశానికెత్తేశారు. కేవలం ఐపీఎల్ (IPL) టీమ్ ఓనర్‌గానే కాకుండా, తన తండ్రి కళానిధి మారన్(Kalanithi Maran) లాగే వ్యాపార సామ్రాజ్యాన్ని నడపడంలో ఆమెకు సాటిలేరని కొనియాడారు. గతంలో సన్ గ్రూప్ ఓటీటీ విభాగంలో పని చేసినప్పుడు ఆమె చూపించిన మర్యాద, ప్రాజెక్టుల ఎంపికలో ఆమెకున్న విజన్ అద్భుతమని ప్రశంసించారు. బిజినెస్‌లో పదునైన వ్యూహాలున్న కావ్య, మ్యూజిక్ ప్రపంచాన్ని శాసిస్తున్న అనిరుధ్ పెళ్లి తర్వాత కలిసి సరికొత్త 'మ్యూజికల్ బిజినెస్' స్టార్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన చమత్కరించారు.

ఏదేమైనా, ఈ ఇద్దరు సెలబ్రిటీల జోడీ చూడముచ్చటగా ఉంటుందని ఇండస్ట్రీ పెద్దలు సైతం ఆశీర్వదిస్తుండటంతో.. త్వరలోనే ఈ లవ్ స్టోరీ పెళ్లి పీటల వరకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. కోలీవుడ్ మ్యూజిక్ కింగ్, ఐపీఎల్ క్రష్ కావ్య మారన్(Kavya Maran) పెళ్లి వార్తతో ఇటు సినీ ప్రియులు, అటు క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Tags
Anirudh Ravichander Kavya Maran Anirudh Kavya Wedding SRH Sunrisers Hyderabad Kollywood YG Mahendran
Recent Comments
Leave a Comment

Related News